ఆనందం ఒక గొప్ప అనుబుతి. ఈ ఆనందం గురించి కొందరు తత్వవేతలు ఇలా అన్నారు.
“ప్రపంచమంతా మతి భ్రమించినట్లు అనందం కోసం వెదకులాడు తోంది” అన్నాడు ఒక ఫ్రెంచి తత్వశాస్త్రజ్ఞుడు.
“నమ్ముకోడానకు ఒక విశ్వాస ప్రమాణాన్ని, పాడుకోడానికి ఒక పాటను ప్రపంచం అన్వేషిస్తోంది.” అని వ్యాఖ్యానించాడు హార్వార్డ్ విశ్వ విద్యాలయ అధ్యక్షుడు.
టెక్సాస్ రాష్ట్రంలోని ఒక లక్షాధికారి యీ మధ్య తన అనుభవాన్ని యిలా తెలియజేశాడు, “ఆనందాన్ని ధనం వెచ్చించి కొనగలనని అనుకొన్నాను. కాని పూర్తిగా ఆశాభంగుడ నయ్యాను.” ఒక ప్రఖ్యాత సినీతార తన జీవి తాన్నిగూర్చి ప్రలాపిస్తూ, “నాకు ధనం, సౌందర్యం, ప్రతిభ, పలుకుబడి యెంతై నావున్నాయి. నిజానికి ప్రపంచ మంతటిలో నేనే ఆనందజీవినై వుండడానికి ఎంతై నా ఆస్కారంపుంది. కాని నా జీవితమొక విచార గాధః కారణం యేంటో”అంది. బ్రిటన్లో ప్రముఖ పౌరుడొకడు తన జీవితకథను యిలా చిత్రించాడు. “జీవితాన్ని అన్ని అంగులా అనుభవించడానికి కావలసిన సాధన సావకాశాలన్నీ నాకున్నాయి. కాని నిరాశాపిశాచానికి దొరికిపోయాను. కారణం ఏమిటో తెలీదు.” జీవితముపై విసుగుజెంది ఒకడు తన వైద్యుని దగ్గరకు వెళ్ళి యిలా చెప్పుకున్నాడు. “అయ్యా, నేను ఏకాకిని, నిరాశాజీవిని, చింతలతో చిదికిపోయాను. నా కేమైనా సహాయం చేయగలరా?” ఆ వైద్యుడు జవాబిస్తూ, “నీవు ఆ సర్కస్కు వెళ్ళు, అక్కడ ఒక హాస్యగాడున్నాడు. ఎంతటి దుఃఖభాగినై నా నవ్వించగల అతని చేష్టలు నీకు ఉపకరిస్తాయి” అన్నాడు. ఉన్నకాస్త నిరీక్షణను కోల్పోయి అతడు “అయ్యా, ఆ హాస్యగాడిని నేనే, అని తన హృదయవేదన తెలియజేశాడు. ఒక కళాశాల విద్యార్థిని,”నా వయస్సు యిరవైమూడు సంవత్సరాలు. ఈ మాత్రపు వయస్సులోనే ముసలిదాననై పోయినట్లుంది నాకు, జీవితం అంటే నా కప్పుడే విసుగెత్తింది” అని విలపించింది. ఇటీవల ఒక గ్రీకు నర్తకి తన విషాద జీవితాన్నిగూర్చి చెప్పుకుంది. “ఒంటరిగా వుండడం అంటే నా కెంతో భయం. ఒంటరిగా పుండేటప్పుడు అప్రయత్నంగా నా చేతులు వణుకుతాయి, బాష్పజలంతో కండ్లు నిండిపోతాయి, శాంతికొరకు, ఆనందంకొరకు హృదయంలో ఎంతో ఆకలివేస్తుంది. కాని ఆ శాంతిని, ఆనందాన్ని నేనింతవరకు కనుగోలేదు.” నేటి ప్రపంచ రాజకీయవేత్తల్లో ఒకరు నాతో సంభాషిస్తూ, “నేను ముసలివాణ్ణి; జీవితం నిరర్థకమయింది; రేపో, మాపో, మరణానికి దొరికిపోయి అజ్ఞాతసి తిలోకి దొర్లిపోతాను. యువకుడా, ఏదైనా నిరీక్షణాజ్యోతిని చూపించగలవా?” అంటూ సహాయంకోసం యాచించాడు.
ఆనందం ఎలా పొందగలము?
మన లౌకికప్రపంచం ఆనందయూటలకోసం నిత్యం పరుగెడుతూంది. పాండిత్యం హెచ్చేకొలదీ జ్ఞానం సన్నగిలుతోంది. ఆర్థిక సౌభాగ్యం పెరిగే కొద్దీ, జీవితంపై విరక్తి విరజిమ్ముకొంటోంది. ప్రపంచంలో… కారీరక సుఖాల్ని మనం అనుభవించేకొద్దీ, జీవితంపై అసంతృప్తి పెరిగిపోతోంది. నెమ్మది యెరుగని సముద్రంలా మనంపున్నాం. ఈ క్షణంలో ఒక సుఖం, ఆ క్షణంలో ఒక భోగం అన్నట్లుంది మనబ్రతుకు. కాని స్థాయిగా, హాయిగా నెమ్మదిని, స్థిరత్వాన్ని పొందుకోలేకపోతోంది బ్రతుకు, అన్వేషణ మాత్రం సాగుతూనే వుంది. మానవులు ఇంకా హత్యలుచేస్తున్నారు; అబద్దాలాడుతున్నారు: మోస గిస్తున్నారు; దొంగతనాలు జరుగుతూనే వున్నాయి; యుద్దాలు విజృంభిస్తూనే వున్నాయి. ఇట్టిజీవిత దోపిడీలకు కారణాలు అధికార తృష్ణ, భాగ్యభోగాలకై తీరని ఆశ: ఇట్టి కార్యాల్తో తమకోసం తమ పక్షపాతులకోసం శాంతిని, తృప్తిని, భద్రతను, ఆనందాన్ని సంపాదించుకోవచ్చని మానవుల భ్రమః
రికర్ లా ఇల్లాంటి సందర్భాల్లోనే మన ఆంతర్యంలో ఒక చిన్ని స్వరం వినిపిస్తుంది. “ఇట్టి జీవితంకోసం మనం నిర్మింపబడలేదు. ఇంకా గొప్ప విషయాల్ని అనుభవించడానికే సంకల్పింపబడ్డాం.” అంటూ ఆ సందేశం వినవస్తుంది. జీవితానికి సాఫల్యతను చేకూర్చగల ఒక మహా పూట ఎక్కడో వుంది అనే భావం మనలో నిగూఢంగా ప్రత్యక్షమౌతుంటుంది. ఎప్పుడో, ఎక్కడో, ఆ జీవన సుధ మనకు దసులు అవుతుందిలే అనే భ్రమతోనే ఆనందంకోసం అన్వేషణకాలం వెళ్ల బోస్తున్నాం. అప్పుడప్పుడు అది దొరికినట్లే వుంటుంది. వెను వెంటనే భ్రమలు భగ్నం అయిపోతాయి. ఆశలు రెక్కలు కట్టుకొని ఎగిరి పోతాయి. నిర్ఘాంతులమయిపోయి విచారంలో మునిగిపోతాం.
జీవితానికి శాశ్వతానందాన్ని చేకూర్చగలది, పైపైనుండు – గంధం పూతలాగ, సాధారణ పరిస్థితులపై ఆధారపడిపుండదు. శాశ్వతానందం అనేది శ్రమకాలాల్లో ప్రతికూల పరిస్థితుల్లో సహితం హృదయానికి సంతృప్తినిస్తుంది. స్థితిగతులు విరోధములై కన్నీళ్ళే అన్నపానాలయ్యే రోజుల్లోకూడా యిట్టి ఆనందం చిరునగవును పుట్టిస్తుంది. మనమందరం ఆశించే ఆ నిత్యానందం మన జయాపజయాలమీద ఆధారపడి పుండదు. దాని పేళ్లు చాలా లోతుకు పారివుంటాయి, బాహ్యపరిస్థితులెట్టివైనా, అంతరంగంలో మాత్రం శాంతి, విశ్రాంతి, సంతృప్తి విహరిస్తాయి. ఇట్టి ఆనందానికి భౌతిక సాధనాలుచాలవు.
మా యింటికి చేరువనే ఒక సెల యేరుంది. దాని ప్రవాహం యెప్పుడు ఒకేలావుంటుంది. వరదలువచ్చేలా వర్షాలు కురిసినా అది పొంగదు, భగభగమని మండే వేసవికాలంలో కూడా దాని నీరు తగ్గిపోదు. అతివృష్టి, అనావృష్టి దాని ప్రవాహంలో భేదం పుట్టించలేవు. మనం తహతహలాడే ఆనందం యీలాంటిదే.
ప్రకృతికంగా, సహజాతరంగా మూడు ముఖ్య విషయాలు లేకుంటే మానవునికి అసంతృప్తి కలుగుతుంది. మొదటి తన సృష్టికర్తతో తనకుం డాల్సిన సహవాసం. ఎందుకంటే దేవుడు మనల్ని తన స్వరూపంలో జేశాడు. ఆ దివ్య సహవాసం లేకుంటే దోవ తప్పినవాడిలాగ మానవుడు భూముఖాన తిరుగాడుతాడు. తాను బ్రతుకుచున్నానని మనిషి తెలిసికోడం మాత్రం చాలదు. తాను ఏకాకికాడని, ఏదో విజ్ఞానం, శక్తి, తన బ్రతుకును ఆవరించి తన గమ్యస్థానానికి నడిపిస్తున్నాయని అతడు గుర్తించడం అవసరం.
రెండవ లక్షణం – ప్రత్యానికి పరాయివానిగావుంటే తనబ్రతుకు గందరగోళం అని, క్లిష్టమని మనిషి తెలిసికోవాలి, మానవుడికి సత్యంలో సంబంధం యెంతై నావుంది. సత్యమంటే, జీవితాన్నిగూర్చి జంతువులకున్న జ్ఞానంకాదు. భౌతిక శాస్త్రం, గణితశాస్త్రం తెలిసినంతమాత్రాన సరిపోదు. మానవ జీవిత యునికిపట్టుయేదో అతడు తెలిసికోవాలి. జీవిత ప్రాప్తిస్థానం, దాని పుద్దేశం, దాని సమస్యలు, దాని భావిస్థితి, తెలిసికోడమే సత్యం.
మూడవదిగా మానపుడికి శాంతికావాలి, శాంతి అంటే, అర్థంలేని మనో నెమ్మదికాదు. శాంతి ఒక మహాశక్తి. మానవ బతుకును తుఫాను గాడ్పులనుండి విడిపించి, యావజ్జీవితాన్ని ప్రశాంతమొనర్చి, జీవితాన దసు లయ్యే శోధన బాధల్లో శక్తినిచ్చేదే శాంతి. ధన్యతల్లో ఎనిమిదిమార్లు ‘ధన్యులు’ అనే పదాన్ని యేసు వినియో గించాడు, ధన్యతలు అంటే “అందమైన అనురాగాలు” అని ఒక వ్యాఖ్యాత అన్నాడు. ధన్యులు అనే గీకుపదాన్ని “సంతోష జీవులు” అని యనువదించ వచ్చు. కాని సంతోషం అనేమాటకంటే ధన్యం అనేమాటలోనే అర్థపుష్టివుంది. ఎందుకంటే, సంతోషం అనేపదాన్ని కొన్ని అయోగ్యమెన అనుభవాలకి కూడా మనం వాడుతున్నాం. ఆ కారణాన, ధన్యులు అని చెప్పటంలోనే మన ప్రభువు ఉద్దేశాన్ని చక్కగా వ్యక్తం చెయ్యవచ్చు. ‘మీరు సంతోషంగలవారు ‘ అను అర్థమిచ్చే పదాన్ని ఆయన ప్రయోగించాడు. ఆ సంతోషానికున్న సూత్రాల్ని ఆయన పేర్కొన్నాడు. ఈ లోకంలో యోగ్యమైన సంతోషాన్ని, ధన్యమైన అనుభవాన్ని యెరిగిన వాడెవడైనా వుంటే, ఆయన యేసుక్రీస్తే. దాని రహస్యాన్ని కనుగొన్నవాడు ఆయనే. అందుకే ‘ధన్యతల’లో దాన్ని విడమర్చి చూపించాడు,
యేసు చేసిన ప్రభోధమంతా యీ ధన్యతలే కాదు: ఆయన చేసింది ‘కొండమీది ప్రసంగం’ మాత్రమేకాదు. మన పూర్వపు తరంవారు ఒక గొప్ప పొరపాటు చేశారు. అది వారు యేసును అపార్థం చేసుకోడమే. తప్పు చేస్తు న్నామని వారికి తెలీదు, యేసును గూర్చిన వారి నిర్ణయాలు నిజమని వారు మనఃపూర్వకంగా నమ్మారు.

యేసుక్రీస్తు ఒక సాంఘిక సంస్కర్త అనీ, ఆదర్శ జీవితానికి ఆయనొక సాదృశ్యం అనీ వారసుకోడమే ఆ తప్పు. నిజానికి, యిట్టి నిర్వచ నాలకు ఆయన అతీతుడు, సాక్షాత్తు ఆయన రక్షకుడు సిలువపై పాపాత్ముల యతికమాల్ని మోస్తూ వారి విమోచనార్థం మరణించినవాడు. మానవ జీవితానికై దేవుడు సంకల్పించిన త్రోవనుండి తొలిగిపోయి. కుంటుపడినవారి జీవిత ప్రయత్నాలవలన, ఆ దివ్య ఆదర్శాన్ని చేపట్టలేకున్న మానవుల కోసమే ఆయన చనిపోయాడు.
‘యేసు మానవ రక్షకుడు’ అను సత్యానికి సంబంధం లేకుండా, “ధన్యత”లను గాని, “కొండమీది ప్రసంగాన్ని” గాని న్యాయబద్ధంగా గ్రహించ లేం అనే నిశ్చయానికి ఆధునిక పండితులు వచ్చారు. పాత నిబంధనలో కూడ క్రీస్తు సాత్వికుడని ఉదహరింపబడింది. దుఃఖాన్ని ఆనందంగా మార్చే వాడని, నీతినే అన్నపానాలుగా గలవాడనీ ఆయనగూర్చి చెప్పబడింది. ఔను. చివరికి సిలువమీద సహితం ఆ నీతి ఆయన ఆకలి దప్పులయ్యాయి.
ధన్యతల్లో ప్రత్యక్షమయ్యేవాడు యేసుక్రీస్తే. జీవితంలోని స్వచ్ఛమైన ఆనందాన్ని, ధన్యతను నూటికి నూరుపాళ్లు అనుభవించినవాడు లోక చరిత్రలో యేసుక్రీస్తు ఒక్కడే. మనల్ని విమోచించిన రక్షకుడుగా ఆయన మనకు బోధిస్తాడు. నిజంగా ఆయన శిష్యత్వాన్ని అంగీకరించేవారు ఆయన అడుగు జాడల్లో నడవాలని ఆయన బోధించాడు.
ఆయన యీ లోకంలో వుండగా చేసిన ప్రటోధాలు గ్రాహ్యాలై విప్ల వాన్ని పుట్టించాయి. ఆయన మాటలు ఎంక చిన్నవో అంత భావగర్భితాలు. అవి మానవుల్ని కంపింప జేశాయి. ఆనందంతో అంగీకరించడమో, లేక కోపంతో విసర్జించడమో ఆమాటల ప్రతిఫలమయింది. ఆ మాటలు విన్నవారు మార్పుచెందకుండా వుండలేకపోయారు. ఉచ్ఛదశకో లేక తుచ్చ దశకో వారు తిరిగారు, మానవులు ప్రేమతో ఆయన్ని వెంబడించారు, లేదా “కోపంతో ఆయన్ని వివరించారు. ఆయన మాటల్లో గొప్ప ప్రభావం ఉండేవి, ఆశక్తి వల్లే, స్త్రీపురుషులు మహత్కార్యాలు చేయబూసుకొన్నారు. “నా పక్షాన ఉండనివాడు నాకు విరోధి” అన్నదే ఆయన వైఖరి,
ఆయనను వెంబడించినవారు వారి తరంలో మహాత్ములు. వారి హృద యాలు క్రమబద్ధమైనందున వారు భూలోకాన్నే తలక్రిందులు చేశారు. నాటి నుండి లోకం మారిపోతుంది. మానవచరిత్ర మానవాభ్యున్నతి దిక్కు తిరిగింది. మానవులు మానవతతో బ్రతుక వారంభించారు. క్రైస్తవ్యం కాలిడిన తావుల్లో మానవ సామరస్యం, ఔదార్యం, గౌరవం చిగిరించాయి. జీవిత అమూల్యతను విడమర్చి చెప్పిన యీ సువార్త ప్రభావంచేత, కళలు, సంగీతం, విజ్ఞానం విలసిల్లాయి, ప్రవర్థమానంగా అభివృద్ధి నొందాయి. తుదకు, మానవుడు దేవుని స్వరూపంతోను, ఆయన పోలికతోను మెలగసాగాడు. మానవ సమాజానికి క్రైస్తవ్యం వికాసాన్ని కల్గించింది. క్రీస్తువల్ల ప్రసారాలైన ఆధ్యాత్మిక జీవన మహా కెరటాలు, అన్యాయం, అమానుషత్వం, పర సహనలేమి, మొదలగు దుష్ట శక్తుల్ని తుడుపు పెట్టాయి.
ఆ దివ్యజీవన యూటలు ఉబికి ప్రవహించిన, నాటనుండి శతాబ్దాలుగా కాలం గడిచిపోయింది. క్రైస్తవ్యం అనే యీ జీవననది నిరాటంకంగా, నాట నుండి ప్రవహిస్తునే వుంది. కాని పాటు, పోటు, అన్నట్లు మార్పులు చెందుతూ, మొత్తానికి తగ్గుముఖంతోనే పారుతూంది. ఇదిగాక, మానవ నిర్మితాలై న కొన్ని ఉపనదులందు ప్రవేశించి దాన్ని కలుషితం జేశాయి.
నిజకైస్తవులు సంతోష జీవులు: అది వారి జన్మహక్కును, మన తరంలో క్రైస్తవులు క్రైస్తవ పరిభాషను బాగా నేర్చారు కాని క్రీస్తు సూత్రాల్ని, ఆయన ప్రబోధాల్ని పాటించి, ప్రయోగించడంలో నిరరకు లయ్యారు. ఈ దినాల్లో మనకు కావలసింది, ఎక్కువ క్రైస్తవ మతంకాదు; కాని ఎక్కువమంది నిజక్రైస్తవులు. క్రైస్తవ్యాన్ని ఒక సంస్థగా నెంచి దానికి విరోధంగా లోకం వాదించవచ్చు. కాని దేవుని ఆత్మచే క్రీస్తు పోలికగా మార్చబడిన ఒక వ్యక్తిని కాదని యెవరంటారు? అట్టి ధన్యజీవి, ప్రస్తుత ప్రపంచంలోని, స్వార్థం, తార్కికవాదం, భౌతికవాదం మున్నగు విధ్వంసక శక్తులకు గొడ్డలిపెట్టు. బహు తరచుగా మనం లోకంలో వాగ్వివాదాల్తో పెనుగు లాడుతున్నాం, వాస్త వానికి మనం దేవుని సజీవ సువార్తలుగా జీవించాల్సి వుంది; అట్టి సువార్తను మానవులంతా చూస్తారు. చదువుతారు. మనం వెనక్కి మిళ్లి, సజీవయూటల ప్రాప్తిస్థానం వద్దకు వెళ్లి రక్షణ నదీజలాల స్వాస్టిక శక్తుల్ని అలవర్చు కోవడానికి కాలం ఆసన్నమయింది.
యాకోబు చావియొద్ద ఆ స్త్రీలో యేసు చెప్పిన మాటల్ని మళ్ళీ విందాం. “నే నిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడూ దప్పిగొనడు. ” పాప రోగియై, భంగపాటున యీ శ్రీ మానవజాతి అంతటికి సాదృశ్యంగా వుంది. ఆమె హృదయ వాంఛలే మన వాంఛలు. ఆమె హృదయ విలాపాలే మన విలాపాలు. ఆమె భంగపాటు మన భంగపాటు, ఆమె పాపం మన పాపమే! అయితే ఆమె రక్షకుడు మనకూ రక్షకుడే: ఆమె పొందిన పాపక్షమాపణ మనమూ పొందా ల్సిన పాపక్షమాపణే. ఆమె ఆనందం మన ఆనందం అవుతుంది.
నాతో కలిసి ప్రయాణం చెయ్యండవి మిమ్మల్ని కోరుతున్నాను. అది సాహసోపేతమైన ప్రయాణం. ఆశ్చర్యాన్ని కల్గించు అనుభవాలున్న ప్రయాణం అయితే ఈ ప్రయాణం ఉద్దేశం యేంటి అంటారా? ఆనంద రహస్యం: స్థలం ? గలిలయః రెండువేల సంవత్సరాం పుటల్ని త్రిప్పి ప్రయాణం కట్టాలి.
అది గలిలయ సముద్రతీరం వెంటవెళ్లే మార్గం, గాలికి, బాటపై నున్న ధూళి చిన్న చిన్న సుడిగాలిలా వడివడిగా పైకి లేస్తూంది. ఎండ తీవ్రంగా వుంది. ఉక్కచే చెమట పోస్తుంది. కాని వాతావరణం మాత్రం ఆశాజనకంగా వుంది. ఆ ప్రాచీన సముద్ర ముఖంపై ఆటలాడుకొంటున్న కెరటాల్ని గాలి రెచ్చగొడ్తుందా అన్నట్లుంది. అక్కడక్కడ మానవ స్వరాలు పరస్పరాభివందనాల్ని చెప్పుకొంటున్నట్లు వినవస్తోంది. వివిధ మార్గాలవెంట జనవాహిని సముద్రతీరం దగ్గరకు వస్తోంది. “యేసు గలిలయకు వచ్చాడట” అన్న మాటలు వినిపిస్తున్నాయ్.
తటాలున, ఒక కొండ చాటునుంచి ఒక చిన్న పడవలో యేసు, ఆయన శిష్యులు గోచరించారు. కి పెర్నహోం రస్తాకు చేరువలోని తీరాన వారు పడవ దిగారు, ఆ వెనువెంటనే జనసమూహాలు ఆయన చుట్టూ గుమి కూడాయి వారిలో చాలామంది దెకపొలి, యెరూషలేం, యూదయ, యోర్ధాను పరిసరాలనుండి వచ్చారు.
“అదిగో యేసు” అన్న మాటలు ప్రతినోటా ధ్వనించాయి. ఇంకా తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు: తిబెరియా, బెతెస్థ, పెర్నహోము ప్రాంతాలనుండి వస్తున్నారు. విలుపుటంగీల్ని ధరించిన యీ పదముగ్గురిని ప్రజలు అనుసరిస్తున్నారు. చల్ల గాలి వీస్తున్న ఒక కొండచరియవద్ద ఆయన ఆగాడు. అందరు కూర్చోవచ్చని సంస్థ చేశాడు.
అంతా నిశ్చలం, అద్భుతంగావుంది. ఆసమయంలో దాన్ని సేకరించు కొని నిత్యత్వం వరకు దాచుకుందామా అనిపిస్తుంది. యేసు ఒక యెర్రబండ నెక్కి కూర్చొన్నాడు. ప్రజలందరి మీద మౌనం ముద్ర వేసింది. క్రింది, రాజమార్గాన ఎవడో ఒక ఒంటెను తోలుకుంటూ తిబెరియవైపు పోతున్నాడు. యేసును తదేక దృష్టితో గమనిస్తున్న వారి ముఖాలపై ప్రశాంతత నాట్యం చేస్తోంది. నోరు తెరచి యేసు మాట్లాడం ప్ర్రారంభించాడు.
ఆనాడు, ఆ ధన్యతల కొండపై యేసు పల్కిన ఆ మాటలు, అసమాన ప్రసంగంలా, భావగర్భితాలైన దైవోక్తులుగా మానవ చరిత్రలో ముద్రింప బడ్డాయి. ఈకాపులోనే, తన తేలిక మాటల్లో ఎంచి తూచిన తలంపుల్తో, మాన్యమైన భావాల్తో, యేసు ఆనందరహాస్మాన్ని బయలుపర్చాడు. ఆ ‘ఆనందం’ అంటే, కాలానికి, స్థలాని కట్టుబడి యుండే అల్పసంతోషంకాదు. ఆనాడు ఆయన చేసింది, అనంతమందే ఆనందానికి రూపకల్పన.
ఆయన వాడిన మాట “సంతోష జీవులు” (ధన్యులు) మనం ఊహించు కోగల్గినట్టే, ఆమాట వినబడేసరికి అందరి చెవులు నిక్కబొడిచాయి. ఇక రాబోయే పుటలు చదివేకొద్దీ మీరూ అలానే చెవులు పెద్దవిచేసికొని హృద యాల్ని విప్పి, జీవితాల్ని సమర్పణజేస్తూ, ఆయన మాటల్ని వింటారని నా నమ్మకం: అప్పుడు మీ జీవితానికి ఒక నూతన వికాసం చేకూరుతుంది, అనుదిన బ్రతుకులో వెలితి, వ్యర్థత బయటపడతాయి. అనిర్వచనీయమైన సంతృప్తి, ఆనందం హృదయాన్ని నింపివేస్తాయి ఆనందం యొక్క అసలు రహస్యం తేటతెల్లమౌతుంది.
1 thought on “ఆనందం కోసం అన్వేషణ – The Pursuit of Happiness”