యెహోషువ గ్రంథము – ప్రారంభము: Edward Williams Books PDF

యెహోషువ గ్రంథము

గమనిక: ఈ వర్తమానం Edward Williams గారు ప్రసంగించినది. ఈ వర్తమానం Telugu Bible Analysis  స్వంత మాటలలో వ్రాసిన అసలు భాగం. ఈ క్రింది YouTube వీడియోలో చెప్పిన వర్తమానం నుండి వ్రాసినది – Link.

————————————————————————————————–

ఈ గ్రంథము బైబిల్ లోని వరుస క్రమంలో ఆరవ పుస్తకము. ఈ గ్రంథంలో నాయకత్వము విధేయత మరియు దేవుని వాగ్దాన నిశ్చయతను మనం చూడవచ్చు. పాత నిబంధనలో చాలా ప్రాముఖ్యమైన పుస్తకము ఈ పుస్తకం ఎందుకంటే చరిత్రను మరియు ముఖ్య ఘటములను ఇది చెబుతుంది. మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశము నుండి విడిపించ బడిన ఇశ్రాయేలు జనాంగము వాగ్దాన దేశమైన పాలు తేనెలు ప్రవహించు దేశము లేదా కనాను దేశం లోకి ప్రవేశించే కథను ఈ పుస్తకం తెలియజేస్తుంది. ఇది కేవలం చరిత్ర పుస్తకం మాత్రమే కాదు గాని ఒక విశ్వాసి తన జీవితంలో దేవుని పట్ల, వాక్యం పట్ల, ఉంచవలసిన ధైర్యాన్ని బోధించే పుస్తకం ఇది.

మోషే చనిపోయినాక, ఇశ్రాయేలు ప్రజలు కష్టమైన పరిస్థితిలో ఉండగా యెహోషువా అనే నాయకున్ని ఎంచుకున్నాడు. మోషే వంటి గొప్పవాడైన నాయకుని యొక్క స్థానాన్ని రీప్లేస్ లేదా భర్తీ చేయడానికి ఇతను సరిపోయినవాడు. అయితే దేవుడు యెహోషువ ను తన పరిచర్యకు ప్రజలను చూడటానికి నా పిలుపులో ఒక స్పష్టమైన భరోసా ఉంది. దేవుడు అన్నాడు నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు ను తోడైయుండును అని క్రైస్తవుని జీవితంలో విజయానికి మూలము వ్యక్తిగత సామర్థ్యము, తలాంతులు కంటే, నైపుణ్యాల కంటే, దేవునిపై ఆధారపడటం మీద ఉంది అని ఇతని జీవితం మనకు తెలియజేస్తుంది.

యెహోషువా పిలుపు

దేవుడు ఒక వ్యక్తిని తన పని కోసం పిలిచినప్పుడు ఆ వ్యక్తి యొక్క గత అనుభవాలను మరియు యొక్క వ్యక్తిత్వాన్ని దేవుడు ఆయన కొరకు ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. యెహోషువా అని ఈ పుస్తకాన్ని నిశితంగా పరిశీలిస్తే యెహోషువ కేవలం ఒక్క రోజులో నాయకుడు అని చాలా సంవత్సరాలు మోషే అనే సేవకుని యొక్క పరిచారకుడిగా ఉండి దేవుని సన్నిధిని ప్రేమించి యుద్ధరంగంలో అనుభవాన్ని తెచ్చుకొని నాయకుడు అయినట్లుగా చూస్తాం. దేవుడు మనలను ఏ స్థితిలో పిలుస్తాడో ఆ స్థితిలో తన పరిచర్య కొరకు చాలా అద్భుతంగా వాడుకుంటాడు – ఇది తథ్యము.

haggai book telugu commentary pdf
హగ్గయి గ్రంథము వివరణ మరియు చరిత్ర – Edward Williams kuntam

ఉదాహరణ 1 – పేతురు వల విసురుతున్న దేవుడు పేతురును పిలిచాడు. పేతురు పట్టేవాడు ఆ పేతురు కు త్వరగా మాట్లాడే, త్వరగా స్పందించే గుణం ఉన్నవాడు. అందునుబట్టి దేవుడు వద్దు అనుకోలేదు ఆ గుణమును వాడుకున్నాడు అందుకే పేతురు తో అన్నాడు నిన్ను మనుషులను పట్టు శాలరీ గా చేస్తాను అని. ఆ మాట ప్రకారమే సువార్త పరిచర్యకు ప్రతి సందర్భంలో పేతురును దేవుడు వాడుకున్నాడు.

ఉదాహరణ 2 -అపోస్తలుడైన పౌలు చక్కని మాటకారి. విద్యావేత్త, పట్టుదల కలిగిన స్వభావం ఉన్నవాడు. గనుక సువార్తను ప్రకటించి ప్రభువును పరిచయం చేసే పని కొరకు వాడుకున్నాడు. ఎన్నో దేశాలు తిరిగాడు

అదేవిధంగా యెహోషువ యొక్క విధేయత మరియు పట్టుదల అతనిని ఇశ్రాయేలీయుల జనగాం ని వాగ్దాన దేశములోనికి నడిపించేలా సిద్ధం చేసింది.

యెహోషువ గ్రంథం 1:8 లో దేవుడు అద్భుతమైన విజయ సూత్రాన్ని చెప్పాడు. “ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధించుట మానకూడదు – నీ మార్గమును వర్ధిల్లాలి చక్కగా ప్రవర్తినుచ్చుదువు”

ఒక వ్యక్తి తన జీవితంలో లేదా పరిచర్యలో లేదా తన వ్యాపారంలో లేదా తన చదువులో లేదా తన వృత్తిలో అభివృద్ధి చెందాలంటే ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే దేవుని వాక్యమే ప్రధాన ఆధారము. ఆ వాక్యమును రాత్రింబవళ్లు చదవాలి అని కీర్తన 1లో చూస్తాం.

యెహోషువ

గొప్ప సేవ

  1. మన పూర్వికుల సేవ కంటే గొప్పగా మనం సేవ చేయాలని దేవుడు ఆశిస్తాడు.
  2. వాక్యము నుండి కుడికి గాని ఎడమ కు గాని ఈ పోకుండా నడుచుకోవడం అత్యంత ప్రాముఖ్యం
  3. ఆ విన్న వాక్యమును ప్రేమించుకున్న అప్పుడే దానికి ద్వారం తెరవబడుతుంది.

భక్తుడైన యెహోషువా లో దేవుని వాక్యములో ఆయనకున్న భక్తిశ్రద్ధలు ఈ మూడు విషయాలను చూడవచ్చు. కనాను దేశం స్వతంత్రించుకోనుట అనునది ఒక సవాలే. ఎరికో ఎత్తయిన గోడలు మరియు ప్రాకారాలు ఉన్న పట్టణం. కానీ దేవుడు యెహోషువకు చెప్పినది మాత్రం ఒక్కటే ‘నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు’ అని. ఒక విశ్వాసి జీవితంలో కూడా యేరికో గోడలు వలె కనిపించొచ్చు. అలాంటప్పుడే దేవుని ఆజ్ఞలకు లోబడి నడిస్తే అసాధ్యము కూడా సుసాధ్యం అవుతుంది. యేరికో పతనం మానవ బలంతో అయ్యింది కాదు.. అది దేవుని యొక్క అద్భుతం. మానవుడు చూపించిన విధేయత.

యోసేపు - joseph
యోసేపు జీవితం: Joseph Life and History – Edward Williams Kuntam Messages PDF

తరము ఏదైనా దేవుని వాక్యం మాత్రమే ప్రామాణికంగా తీసుకొని పరిచర్య చేయాలి ఇదే యెహోషువా మనకు నేర్పించేది. క్రైస్తవ కుటుంబములలో జన్మించెను అంత మాత్రమున దేవుని బిడ్డ అవ్వలేరూ. కేవలము యెహోషువా వలె దేవుని సన్నిధిలో గడపటం, వాక్య ధ్యానము, ప్రార్థన మరియు దేవుని సొంత రక్షకునిగా అంగీకరించుట ద్వారా మాత్రమే.. ఈ అధికారం లభించును.

యోహాను సువార్త 1:12 ప్రకారం, "తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను."

ఈ వ్యక్తిగత సహవాస సంబంధమే యెహోషువ ను ఒక సామాన్య పరిచారకుడు నుండి విజయవంతమైన నాయకుడిగా చేసింది.

కొన్ని హెచ్చరికలు:

యెహోషువ గ్రంథంలో విజయం మాత్రమే అవిధేయత వల్ల కలిగే నష్టాలను కూడా చూడొచ్చు ఆగాను చేసిన పాపం వలన ఇశ్రాయేలీయుల సైన్యం ఓడిపోవడం వంటివి… కొన్ని ముఖ్యమైన హెచ్చరికలు గా – దేవుని ఆజ్ఞలను అతిక్రమించడం, పాపములు ఒప్పుకో లేకపోవడం, పరిశుద్ధుడైన దేవుని విస్మరించడం మరియు మర్చిపోవడం వంటివి చూస్తాం.

ఈ విధముగా యెహోషువ అనే ఈ పుస్తకం బోధించే సారాంశం ఏమంటే దేవుని వాగ్దానాలు ఎన్నడు మారవు , స్థిరము. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట నెరవేర్పు అవుతుంది అయితే యెహోషువ వంటి విధేయత మోషే వంటి భక్తి ఉన్నప్పుడే ఆ వాగ్దాన ఫలములను అనుభవించవచ్చు. మనం ఏ స్థితిలో ఉన్నా … ఆ స్థితిని దేవుడు తనకు మహిమ కరంగా మార్చుకుంటాడు అందు కొరకు మనలను సిద్ధపరుస్తాడు కూడా. అయితే ఆయన మనలను వాడుకోవాలంటే వాక్యాన్ని ధ్యానించడం, లోబడడం, నమ్మకం ఉంచడం ప్రథమం.

Leave a Comment