యేసుక్రీస్తులో ఏడు ప్రత్యేకతలు – Seven 7 Specialities of Jesus Christ

యేసుక్రీస్తు జీవితములో చారిత్రాత్మికముగ జరిగిన ముఖ్యమైన ఏడు కార్యములు చాలా ప్రత్యేకములు. ఆ ప్రత్యేకమైన కార్యములు కేవలం యేసుక్రీస్తులో మాత్రమే జరిగెను. ఆయనలో తప్ప ఇంక ఎవ్వరిలో కూడా ఇట్టి కార్యములు జరుగలేదు మరియు జరుగబోవు!

యేసుక్రీస్తు జీవితములోని ప్రత్యెక ఏడు కార్యములు:

1. దేవుని పరిశుద్ధాత్మశక్తి చేత ఆయనొక కన్యకుజన్మించెను.
2. సాధారణ మానవునివలె అన్ని విషయములలో శోధింప బడినను ఆయన పాపములేని జీవితమును జీవించెను.
3. స్వస్థతపరచు అద్భుత కార్యములను ఆయన జరిగించెను.
4. పరిశుద్ధ జీవితమును గూర్చియు, ప్రేమ సత్యము, స్వార్థ త్యాగములను గూర్చియు ఆయన సాటిలేని బోధనిచ్చెను.
5. ఆయన సిలువ వేయబడెను.
6. ఆయన సమాధి చేయబడిన తరువాత మూడవనాడు మృతులలో నుండి పునరుత్థానుడాయెను.
7. నలువది దినముల వరకు కనబడిన తరువాత ఆయన పరలోకమునకు ఆరోహణుడాయెను.

ఈ యేడు కార్యములు క్రైస్తవమునకు వేరులై యున్నవి.

"మే మేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో. ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయు చున్నాము" 

అని యోహాను వేళ్ళ భాగమును గూర్చియే చెప్పెను. క్రై స్రవము ఒక తత్వశాస్త్రములో నుండి ఉద్భవించినది కాదు. ఒకడు ఏకాంతముగ వెళ్ళి చాలా కాలము ధ్యానముచేసి. ఆలోచన చేసి దీనిని పుట్టించలేదు. ఇది మానవ ఆలోచనమీద ఆధార పడినది కాదు. దీని వేళ్ళు చారిత్రిక కార్యములం దున్నవి. వాటిని ఋజువు పరచవచ్చును. తాకి, చూచి తెలిసికొను శాస్త్రజ్ఞుడు క్రైస్తవమును తన నిశ్చితాభిప్రాయముల పద్ధ తికి సరియైనదిగా గమనించగలడు. అయితే తత్వజ్ఞుడు కూడా క్త్ర స్తవమును తన నిశ్చితాభిప్రాయములకు సరియైనదిగా కను గొనును; ఎందుకనగా. క్రైస్తవములొ చారిత్రిక కార్యముల వలన స్థిరపరచబడిన అనేక సిద్ధాంతములును. తత్వములును కలవు. ఇవి క్రైస్తవమునకు మ్రానువంటివి వీటిని పరీక్షించుట వలన తత్వజ్ఞులు కూడా తృప్తిపడెదరు. మొదట కార్యము జరుగును. ఆకార్యము జరిగిన తరువాత మన అభిప్రాయమును నిశ్చయించెదము; అది సిద్ధాంతమగును, దేవుడు చేసిన దానిని చూచి, ఆయన ఎట్టి వ్యక్తియో ముందు కేమి చేయునో అను వాటిని మనము నిశ్చయించెదము.

ఒక క్రొత్త సిద్ధాంతము స్థిరపరచబడక మునుపు ఒక క్రొత్త కార్యము జరుగవలెను. 1903 సంవత్సరమున రైట్ అన్నదమ్ములు విమానమునందు పై కెగిరి సురక్షితముగ ఒక విమిషము ప్రయాణించి దిగ్విజయులై క్రిందికిదిగిరి, మానవుడు పక్షులవలె ఆకాశములో ప్రయాణము చేయవచ్చునని అంతకు ముందు కొంతమంది ఊహించిరి. అయితే ఎవరును ప్రయా ణము చేయలేకపోయిరి. వీరు చేసిన మొదటి ప్రయాణము చాలా చిన్నది. ఒక నిమిషము లోపల క్రిందికి రావలసి వచ్చెను. అయితే ప్రమాదము లేకుండ తిరిగి విమానము క్రిందకు దిగినందున వీరు చాలా సంతోషించిరి. అది ఒక క్రొత్త కార్యము. అప్పటినుండి నేటి వరకు ఈ అరవై రెండు సంవత్సరములలో ఎంత అభివృద్ధి కలిగినదో మనమే చూచు చున్నాము, మానవుడు విమానములో ప్రయాణము చేయగల డనే సిద్ధాంతము అంతకు మునుపు స్థిరపరచబడలేదు. అయితే కాత్యము జరిగిన తరువాత సిద్ధాంతము స్థిరపరచబడినది. క్రైస్త వము ఆలాగునున్నది. యేసుక్రీస్తు కొన్ని కార్యములు చేసిన తరువాత వాటివలన క్రొత్త సిద్ధాంతములు స్థిరపరచబడినవి.

పై చెప్పబడిన ఏడు వేళ్లలో నొక్కొక్క దానిని తీసి కొని యీ చారిత్రిక కార్యములనుండి యేడు సిద్ధాంతములు పెరుగుటను చూచెదము.

1. దేవుని పరిశుద్ధాత్మశక్తి చేత ఆయనొక కన్యకు జన్మించెను

యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ శక్తిచేత కన్యయైన మరియకు జన్మించెను. ఇది చారిత్రిక కార్యము దీని వలన రెండు ముఖ్యమైన సిద్ధాంతములు విశదీకరింపబడి యున్నవి. పరిశుదాత్మ శక్తి చేత ఆయన జన్మించెను. గనుక ఆయన దేవుని కుమారుడనియు కన్యయైన మరియకు జన్మించెను గనుక ఆయన మనుష్య కుమారుడనియు క్రైస్తవము బోధించుటకు ఆధారము దొరికినది. యేసుక్రీస్తులో దేవత్వమును మానవత్వ మును యీ రెండును యేకీభవించి యున్నవి. ఆయన దేవ త్వము మానవత్వమును యీ రెండు నిజమైనవియు సంపూర్ణ మైనవియునై యున్నవి. ఈ సిద్ధాంతము కలుగక ముందు ఆయన పుట్టుక కార్యము జరుగెను. ఆయన దైవనరుడు ఆయన నరావతారము యిష్టప్రకారము ధరించి తీసివేయునటి మాయ సంబంధమైన అవతారము కాదు. మానవులందరికి నియమింప బడిన చట్టములకు ఆయన లోనై యుండి నిజ మానవ జీవిత మును జీవించెను. పుట్టుకతోనే ఆయన దైవ నరుడాయెను. తాను తరువాత చేయవలసిన పాప విమోచనము కొరకైన కార్యమునకు తగినట్లుగా ఆయన అద్భుతమైన జన్మముతో శరీరమును దాల్చెను. ఆయన దేవుడైయుండెను, కాబట్టి పాప విషయములలో శుద్ధీకరణము చేయుటకు అర్హుడాయెను. ఆయన మానవుడై యుండెను. కాబట్టి మనపక్షముగా విజ్ఞాపనము చేయుటకును మధ్యవర్తి యగుటకును అర్హుడాయెను. ఆయన అద్భుతమైన జన్మకార్యమువలన యీ సిద్ధాంతములు విశదీక రింపబడినవి.

haggai book telugu commentary pdf
హగ్గయి గ్రంథము వివరణ మరియు చరిత్ర – Edward Williams kuntam

2. సాధారణ మానవునివలె అన్ని విషయములలో శోధింప బడినను ఆయన పాపములేని జీవితమును జీవించెను

మనవలె అన్ని విషయములలో శోధింపబడినను ఆయన పాపము చేయలేదు (హెబ్రీ 4:15) మోసము చేయు టకు ఆయన శోధింపబడెను. వ్యభిచారము చేయుటకు ఆయ నకు శోధన కలిగెను. అబద్ధమాడుటకు ఆయన శోధింపబడెను. మనకు కలుగు ప్రతి శోధన ఆయనకు కలిగెను. తన జీవిత కాలమంతటిలో రోజురోజు మనవలెనే శోధింపబడుచు వచ్చెను. అరణ్యములో నలుబది దినములు ఉపవాసముండిన తరువాత అపవాదిచేత మూడు విధములైన శోధనలు రాగా వాటిని జయించెను, కాబట్టి అపవాది ఓడిపోయి తిరిగి ఆయన దగరకు రాలేదని మనము అనుకొనకూడదు, అపవాది ప్రతిశోధన ముగించి ‘సమయము వచ్చువరకు ఆయనను విడిచిపోయెను’ (లూకా 4:13). అపవాది యేసును జయించుటకు ఎల్లప్పుడు సమయముకొరకు కని పెట్టెను, అయితే యేసు పరిశుద్ధ జీవిత మును, ప్రేమ జీవితమును జీవించి మనము ఉత్తమమైన జీవి తము జీవించుటకు మాదిరి జీవితము చూపించెను. దేవుడు కోరిన ఉన్నత స్థితికి మానవులు రాగోరినయెడల, క్రీస్తువంటి జీవితమును వారు జీవించవలెను. ఆయన పాపము లేని జీవిత మును జీవించెను. ఇది జరిగిన కార్యము. దీనివలన ఒక సిద్దాం తము స్థిరపరచబడెను. అనగా ఆయన మనకు మాదిరియై యున్నాడు.

ఇతర పోస్టులను చదవండి – CLICK HERE

3. స్వస్థతపరచు అద్భుత కార్యములను ఆయన జరిగించెను

రోగులను స్వస్థపరుచుటచే మానవులు రోగము లతో బాధపడు దేవుని చిత్తముకాదని ఆయన చూపెను. పాపము సాతాను రాజ్యము నందొక భాగమైనట్లు రోగము కూడా నొకభాగమై యున్నది. రోగములు తీసివేయుట దేవుని యొక్క పనియై యున్నది. యేసుక్రీస్తు రాక మునుపు రోగ ములు ఎందుకు కలుగుచున్నవో ఆలోచించినవారు రెండు జవాబు లిచ్చిరి. తల్లిదండ్రుల పాపముల వలన రోగములు కలుగుచున్నవని యూదులు ఎక్కువగా భావించిరి. అనగా వంశ పారంపర్యమువలన రోగములు కలుగుచున్న వన్నారు.

jesus healing blind, jesus miracles

అయితే పూర్వజన్మ కర్మవలన రోగములు కలుగుచున్నవని హిందువులు, గ్రీకులును భావించిరి. వీరు జన్మాంతర మను సిద్ధాంతము నంగీకరించినందువలన ఈ భావము చూపించిరి, ఆలాగున యేసు శిష్యులు పుట్టు గ్రుడ్డివానిని చూచినప్పుడు “వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా?” అని యేసుప్రభువును అడిగిరి. (యోహాను 9:2). వారు అడిగిన ప్రశ్నలో ఈ రెండు సిద్ధాంతము లిమిడి యున్నవి? వీడా? అని అడుగుటలో వీని పూర్వజన్మ కర్మవలన ఈ రోగము కలిగెనా? అను అర్ధమున్నది. వీని కన్నవారా? అని అడుగుటలో వంశ పారంపర్యమువలన రోగము కలిగెలా? అను అర్థమున్నది. ప్రభువు ఈ రెంటిని త్రోసివేసెను. వీడై నను. వీని కన్నవారైనను పాపము చేయలేదని జవాబిచ్చెను. అయితే జవాబిచ్చిన తరువాత తన కార్యమువలన క్రొత్త సిద్ధాంతమును నెలకొల్పెను. కొంతమంది సిద్ధాంత రీతిగా వాదించి రోగులను బాగుచేయక విడిచిపెట్టెదరు. అయితే ప్రభువు రోగులమీద జాలిపడి వారు కనబడినప్పుడెల్లా వారిని స్వస్థపరుచుచు వచ్చెను. ఆయన చేపిన కార్యమువలన రోగులను బాగుచేయుట దేవునిపనియైయున్నదని మనమొక క్రొత్త సిద్ధాంము నేర్చుకొన్నాము. ఒకవేళ నూటికి రెండుసారులు క్రమశిక్ష నిమితము దేవుడు మనమీద రోగములను పంప వచ్చును, అయితే పాపములు, రోగములు ఈ రెండు సాతాను రాజ్యములో కలవు. దేవుని రాజ్యములో వీటికి స్థలము లేదు. పాపములను తీసివేయుటకును రోగములను బాగుచేయుటకును యేసుక్రీస్తు వచ్చెను. క్రీస్తుయొక్క కార్యములవలన మనమీ సిద్దాంతమును నేర్చుకొని యున్నాము. ఆయన అనుచరులు ఎక్కడికి వెళ్ళినను వైద్యశాలలు స్థాపించి రోగ నివారణ చేయుటకు ప్రయత్నించుదురు.

4. యేసు క్రీస్తు సాటిలేని బోధలు

4. ఆయన తన సాటిలేని బోధవలన పరిశుద్ధతయు, ప్రేమయు, తండ్రివంటి పరిపూర్ణతయు, సత్యమును, తన్ను తాను పేక్షించుకొనుటయు, మొదలగు వాటిని ఉన్నత స్థితికి తెచ్చెను. నిరుపయోగకరములగు నీతి మాటలు పదే పదే చెప్పకుండుటయేగాక అవశ్యకములైన బోధనలను ఏర్పరచి, వాటిని గ్రహించి మనస్సునందుంచుకొనులాగున వాటిని క్లుప్త పరచెను. గోధుమగింజ భూమిలో పడి చనిపోతేగాని అది మొలకెత్తి ఫలింపనేరదని ఆయన నొక్కి చెప్పెను. ప్రభువు బోధ యిదియే. ఈ బోధ బోధించినవాడు మనకు ప్రభునై యున్నాడు. కాబట్టి ఆ బోధను త్రోసివేయుటకు వీలుకాదు. మనము దానిని అనుసరించుటకు బద్ధులమై యున్నాము. ఇది క్రైస్తవ సిద్ధాంతము,

5. యేసుక్రీస్తు సిలువ వేయబడెను

యేసుక్రీస్తు సిలువపై మృతిపొందెను, ఇది చారి త్రాత్మికముగ జరిగిన కార్యము, కాబట్టి ఆయన యెందుకు సిలువపై మృతిపొందెనని అందరు అడుగుదురు. యితరు లట్టి శరీర బాధ ననుభవించి మరణించిరి, కొంతమంది నేరస్థులు న్యాయముగ శిక్ష పొంది తమ పాపముల వలన బాధపడి మరణించిరి. అయితే క్రీస్తు నేరస్తుడు కాడు. కొంత మంది హతసాక్షలు సత్యము నిమిత్తము పోరాడి స్తంభములకు కట్టబడి కాల్చబడిరి. అయితే క్రీస్తు హతసాక్షికాడు. ఆయన చనిపోయి నమాధిలోనే యుండినట్లయితే ఆయన హతసాక్షి యని చెప్పుటకు కొంతవరకు ఆస్పదము దొరకును. కాని ఆయన లేచినందువలన హతసాక్షి కాడని రుజువైనది. ఆలాగైతే ఆయన యెందుకు సిలువపై మృతినొందెను? దీని కర్థమును చెప్పవలెను. భక్తిపరులు సిలువధ్యానము చేసినందు వలన క్రొత్త నిబంధనలో దివ్యమైన సత్యములను బయలు పరచిరి, వారనేక విధములుగా యీ సత్యములను విశదీకరించు టకు ప్రయత్నముచేసిరి. క్రింది విధమైన మాటలతో వారు

దీని అర్థమును బయలుపరచిరి :—

యోసేపు - joseph
యోసేపు జీవితం: Joseph Life and History – Edward Williams Kuntam Messages PDF

ఆయన పాప ప్రాయశ్చిత్తార్థమై మృతినొందెను, పాపులను నీతిమంతులనుగా తీర్చుకు చనిపోయెను.
పాపులకు ప్రతిగా, క్రయధనముగా తన ప్రాణ మిచ్చెను.
పాపులను పవిత్రపరచుటకు చనిపోయెను.
పాపముల విషయములో శుద్ధీకరణము చేయుటకు తన్ను తాను బలిగా అర్పించెను.
పాప పరిహారార్థమై చనిపోయెను,
పాపులను దేవునితో సమాధాన పరచుకొనుటకు మృతి నొందెను

ఏరీతిగ చూచిన క్రీస్తు సిలువ మరణమువలన యనేక కొత్త సిద్ధాంతములు స్థిరపరచబడెను. మొదట కార్యము జరిగెను:— యేసుక్రీస్తు సిలువపై మృతినొందెను దీని అర్ధము గ్రహించుటకు మనుష్యులు ప్రయత్నము చేసినందువలన క్రొత్త సిద్ధాంతములు కలిగెను,

6. యేసుక్రీస్తు సమాధి చేయబడి మూడవనాడు పునరుత్థానుడాయెను

6. ఆయన సమాధి చేయబడిన తరువాత మూడవ నాడు మృతులలోనుండి పునరుత్థానుడాయెను. ఇది చారి త్రాత్మికముగ జరిగిన కార్యము. ఈ కార్యమువ లనకూడ కొన్ని క్రొత్త సిద్ధాంతము లేర్పడినవి. ఆయన సమాధిలోనే యుండినట్లయితే ఆయన చేసిన త్యాగమువలన పాప ప్రాయశ్చిత్తము కలిగెనో లేదో యని మనము సందేహపడి యుండవచ్చును. ఆయన సమాధిలో ఉండిపోయినట్లయితే ఆయన చేసిన త్యాగము దేవునికి అంగీకారమైనదో లేదో యని మనము సందేహపడి యుండవచ్చును. ఆయన లేచి నందువలన ఈ సందేహములను సంపూర్తిగా తీర్చెను. మరియు తనయందు విశ్వాసముంచు వారిని మృతులలోనుండి లేపెదనని ఆయన చేసిన వాగ్దానమును నెరవేర్చుటకు తాను శక్తివంతుడనిగూడా ఆయన ఋజువు పరచెను.

JESUS ROSE FROM DEATH

క్రీస్తు సమాధి లోనే యుండినయెడల క్రైస్తవ నిరీక్షణ విశ్వాసములును అలాగే జీవము లేనివై యుండును. క్రీస్తు పునరుత్థానము క్రైస్తవ విశ్వాసమునకు క్రైస్తవ సిద్ధాంతమునకు ఉంగుటేరు వంటిదై యున్నది. ఆయన ఎట్టి పాపములేని జీవితమును జీవించి అద్భుత కార్యములను చేసియున్నను. సజీవుడుగా లేకుండిన యెడల క్రైస్తవమను వృక్ష మెన్నటికిని జీవము లోనికి వచ్చియుండక పోయెడిది.

7. యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణుడాయెను

7. క్రైస్తవములోని ప్రాముఖ్య చారిత్రిక కార్యము లలో క్రీస్తు పరలోకారోహణము అనునది ఏడవది. యిదియు జరిగిన కార్యము ఆయన తిరిగి వచ్చునను సిద్ధాంతము దీని నుండియే బయలుదేరినది. క్రీస్తు ఆరోహణమైన తరువాత అక్కడికి వచ్చిన దూతలు, శిష్యులతో వారు ఆయనను ఏ విధముగా పైకి ఎక్కిపోవుట చూచిరో అదే విధముగా ఆయన తిరిగి వచ్చుట చూతురని చెప్పిరి (అ.కా. 7:11) ప్రేమ, పరిశుద్ధతగల జీవితమును జీవించి యేసుప్రభువు రెండవరాకడ కొఱకు సిద్ధపడుటకు ఆయన తిరిగి వచ్చుననెడి క్రై స్రవ సిద్ధాం తము ఒక ముఖ్య హెచ్చరికై యున్నది.

3 thoughts on “యేసుక్రీస్తులో ఏడు ప్రత్యేకతలు – Seven 7 Specialities of Jesus Christ”

Leave a Comment