క్రైస్తవ సంఘ చరిత్ర: Christian Church History in Telugu

క్రైస్తవ సంఘ చరిత్ర – ప్రారంభదశ.

క్రీస్తు శకము మొదటి శతాబ్దములో అంతియొకయ అను పట్టణములో, యేసుప్రభుని రక్షకుడుగా నమ్మి, ఆయన మార్గమును అనుసరించుచున్న వారిని ‘క్రైస్తవులు’ అని పిలిచారు. సంఘమైతే మొదట యెరూషలేము పట్టణములో ఒక మేడగదిలో 120 మందితో ప్రారంభమైంది. అది, యేసుక్రీస్తు ఆరోహణమై పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో ఆరంభమైన ఆది సంఘము. ఆరోజే పేతురు రక్షణ పొందుటను గూర్చి ప్రసంగించగా మూడువేల మంది నమ్మి బాప్తీస్మము పొంది వారితో చేరారు. ఆ తర్వాత మరి ఐదు వేలమంది బాప్తీస్మము పొంది చేర్చబడిరి. వారంతా ప్రతిరోజు ఆయా స్థలములలో ఇంటింటా కూడుకొనుచు, ప్రార్థించుకుంటూ, సహవాసములో బలపడిరి. వారిద్వారా అద్భుతాలు, సూచక క్రియలు జరుగుచుండినందున ఆనాటి ప్రపంచములో గొప్ప గుర్తింపును పొందారు. అప్పటి నుండి క్రీస్తు అనుచరులు బహుగా విస్తరించారు. భూలోకమును తలక్రిందులు చేసెడివారు అని కూడ వారినీ’ గూర్చి ప్రజలు అనుకునేవారు.

అయినా యేసును సిలువ వేసినట్టి యూదులు ఈ మార్గమును అడ్డుకుంటూ క్రైస్తవులను హింసించుట మొదలుపెట్టారు. అందువల్ల చాలమంది క్రైస్తవులు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అయితే వారు ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడ వారిద్వారా ప్రజలకు మేలు కలగడం, సంఘాలు ఏర్పడడం జరుగుతూ వచ్చింది.

ఆ సమయంలో సౌలు అనబడిన ఒకవ్యక్తి క్రైస్తవులను హింసించి సంఘమున్ను నాశనము చేయవలెనని పట్టుదలతో ప్రభుత్వము యొక్క అనుమతిని కూడ పొంది, పల్లెలకు పట్టణాలకు పోయి క్రైస్తవులను నానా హింసలు పెడుతుండేవాడు. ఒకరోజు దమస్కు (Damascus) అనే పట్టణంలో గల క్రైస్తవులను పట్టితెచ్చి జైళ్లలో వేయాలని బయలుదేరాడు, అయితే ఆ పట్టణపు గవిని దగ్గర యేసుక్రీస్తు గొప్ప వెలుగులో అతనికి ప్రత్యక్షమవడం, సౌలు క్రింద పడగా యేసుప్రభువు అతనితో మాట్లాడడం జరుగుతుంది. లేచిన తర్వాత అతని కళ్లు కనబడక పోవడం, దేవుని సూచన మేరకు ఆ పట్టణంలోకి సేవకుల ద్వారా నడిపించబడడం, అక్కడ అననీయ అను క్రైస్తవుడు ప్రార్ధన చేయగా, అతని కళ్లలో నుండి పొరలవంటివి రాలి చూపు పొందడం జరుగుతుంది.

దానితో అతనిలో క్రోధం పోయి కృతజ్ఞతా భావం కలిగి, యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించాడు. అప్పటినుండి యేసుక్రీస్తే పాపుల రక్షకుడని ప్రకటించడం మొదలు పెట్టాడు. దానికిగాను అతను ఎన్నో శ్రమలు, హింసలు, నిందలు అనుభవించాడు. అతనినే పౌలుగా మనం క్రొత్త నిబంధనలో చూస్తుంటాము. బైబిలులోని క్రొత్త నిబంధన భాగంలో ఎక్కువ భాగం పౌలు వ్రాసిన పత్రికలే. అవి ఇప్పుడు క్రైస్తవులు అనుసరించుచున్న సిద్ధాంతాలుగా, మార్గదర్శకాలుగా నిలిచి పోయాయి. అతని ద్వారా, చిన్నాసియా, ఐరోపా ప్రాంతాల్లో చాల సంఘాలు స్థాపించబడ్డాయి. తుదకు రోమావారి చేతుల్లో హతసాక్షియైనాడు.

క్రైస్తవ సంఘాన్ని హింసించినవారిలో మొదటి వారు యెరూషలేములోని మతాసక్తి గల యూదులు, ఆ తర్వాత పరిసయ్యుల తెగవారు. కొంతకాలానికి క్రైస్తత్వము ప్రజల్లో చాలా విస్తరించడంతో యూదులు ఆనాటి రోమా ప్రభుత్వానికి వీరి పని అప్పగించారు. అప్పటిలో రోమా అన్ని మతాలను సహించేలాగా ఉండేది. అయితే ఏ మతస్థులైనా రోమా చక్రవర్తికి విధేయులై యుండి ఎవరి మతాన్ని వారు అవలంభించుకోడానికి అనుమతి నిచ్చేది. రోమా వాళ్లు క్రైస్తవ మతాన్ని కూడ యూదా మతములో ఒక భాగంగా చూసేవాళ్ళు. కాని క్రైస్తవము వేరైనదని, అపాయకరమైనదని యూదులు రోమాకు నచ్చచెప్పడంతో క్రైస్తవులపై హింస ఎక్కువైంది. ‘నీరో’ అనే చక్రవర్తి క్రైస్తవులకు పెట్టిన చిత్రహింసలు చాల భయంకరమైనవి. ఆ తర్వాత చక్రవర్తులు అతన్ని అనుసరించారు. ఇంతకు ఈ హింసలకు కారణం ఏమంటే క్రైస్తవులు రోమా చక్రవర్తిని ‘ప్రభువు’ అనే దానికి అంగీకరించకపోవడం, రోమా వారి దేవతలను క్రైస్తవులు గుర్తించకపోవడం.

ఇంకా ఎంతో మంది; వంశపారంపర్యాలు చేయ్యాలనే క్రైస్తవ అతివాదులు, క్రైస్తవ్యమును గ్రీకు వేదాంతంతో కలపాలనే వారు, ఒకడు క్రైస్తవుడు కావాలంటే మొదట యూదా మతస్థులవ్వాలనే వారు, క్రైస్తవులను హింసించినవారే. ఒకప్రక్క హింసించబడుచున్నను మరొక ప్రక్క దేవుడు వారితో కూడ నుండి సూచక క్రియలు చేస్తూ పాపులను రక్షిస్తూ, సంఘమును ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు.

అన్ని రకాలైన మనుష్యులు క్రైస్తవులుగా మారుచున్న రోజులవి. మొదట్లో యూదులు చాలమంది మారినప్పటికీ, పోను పోను అన్య జనులు (యూదులు కానివారు) ఎక్కువగా సంఘాల్లో నిండి పోయారు. సుమారుగా మొదటి శతాబ్ధము మధ్య కాలంలో సంస్థలుగా ఏర్పడి, బోధకులు, ప్రార్ధనా స్థలాలు సంఘ నాయకుల ఎన్నికలు, మొదలగు వానితో సంఘ కార్యాలు జరిగించే విభాగాలు ఏర్పాడ్డాయి. క్రమంగా సంఘాలు సంస్థలుగా రూపందుకున్నాయి. సంఘాల్లో నాయకత్వం, ఈనాడు మనము వింటున్న ‘చర్చి ఫాదర్స్’ అనేవారి చేతుల్లోకి చేరిపోయింది.

ఆనాటి సంఘ నాయకులలో (Church Fathers) అగస్టీన్ (354-430 AD), మరియు జెరోమ్ (342-420 A.D) అను వారు ముఖ్యులు. అగస్టీన్ గొప్ప బైబిలు వేదాంతి కాగా, జెరోమ్ బైబిలును లాటిన్ భాషలోకి తర్జుమా చేశాడు. దానిని లాటిన్ వల్గేట్ (Latin Vulgate) అని అంటారు. ఆ బైబిలే రోమన్ కాథలిక్ వారు అనుసరించేది.

క్రైస్తవ సంఘ చరిత్ర

క్రైస్తవులకు మంచి రోజులు

క్రీ.శ. 306లో కాన్స్టంటైన్ (Constantine) అనే గవర్నరు రోమన్ చక్రవర్తిగా నియమింపబడ్డాడు. కాని అతను సింహాసనాన్ని చేజిక్కించుకోవడానికి పోరాడ వలసి వచ్చింది. 312సం॥లో యుద్ధానికి పోయేముందు, అతనికి, సూర్యునికి పైగా ఒక సిలువగుర్తు కనబడి, ‘ఈ గుర్తుతో జయించు’ అనే మాటలు వినబడ్డాయని, అప్పుడతని జెండాల మీద సిలువ గుర్తు వేసికొని యుద్ధం చేసి జయించాడని చెబుతారు.

yesu 1 word
Jesus 1st Word Telugu – యేసు సిలువలో పలికిన 1 మొదటి మాట

ఎట్లయితేనేం, కాన్స్టెంటైస్ ఆ తర్వాత యేసుక్రీస్తుని నమ్మి క్రైస్తవుడవడం జరిగింది. దానివలన అప్పటివరకు హింసించబడుచున్న క్రైస్తవులకు, ఇతర మతస్థులకు కూడ ఎవరికిష్టము వచ్చిన మతము వారు అవలంభించుకోవచ్చునని ఈ చక్రవర్తి మతస్వాతంత్ర్యాన్ని ప్రకటించాడు. అంతేకాక క్రైస్తవులకు మంచి అవకాశలివ్వడం ప్రారంభించాడు. ముఖ్యమైన ఆఫీసుల్లో, మిలిటరీలో వారికి స్థానం కల్పించాడు. క్రైస్తవ దేవాలయాలు కట్టించాడు. క్రైస్తవ మతాన్ని అతని ఆస్థాన మతముగా చేసి, దేశంలో ప్రతియొక్కరు క్రైస్తవ మతాన్ని స్వీకరించాలి అని ఆజ్ఞ జారిచేశాడు. తదుపరి అతని ముఖ్య పట్టణాన్ని ‘బైజాంటియం’ అనే చోటికి మార్చి దానికి అతని పేరుకు గుర్తుగా ‘కాంటినోపిల్’ అనే పేరు పెట్టాడు. ఆ పట్టణమే “క్రొత్త క్రైస్తవ రాజ్యానికి” ముఖ్య పట్టణమైంది. ‘ఇంకను, ఆదివారము శలవుదినముగాను, ప్రార్థనా దినముగాను ప్రకటించి, మిలిటరీ వాళ్ళు కూడ ప్రార్ధనలకు వెళ్లడానికి అనుమతించాడు. ఇంతవరకు చాల బాగుంది.

క్రైస్తవ సంఘాల్లోకి నిర్భందవు మార్పిడి

కాన్స్టంటైన్ తర్వాత థియోడోసియన (AD 378-398) అనే చక్రవర్తి సింహాసనాన్ని అధిష్టించాడు. అతను, క్రైస్తవ మతాన్ని రోమా రాజ్యపు అధికారిక మతము (State Religion) గా చేసి నిర్బందమైన సంఘ సభ్యత్వాన్ని ప్రవేశ పెట్టాడు. ఇక్కడే క్రైస్తవ సంఘానికి చెప్పలేనంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చి పడింది. నిర్బంధ మార్పిడి వలన సంఘాలు మార్పులేని ప్రజలతో నిండి పోయాయి. ఇతర మతాలను బలవంతంగా అణిచి వేశాడు. విగ్రహారాధనను ‘నిషేధించి, అన్య దేవతాలయాలను పడగొట్టించడం వలన చాల రక్తపాతం జరిగింది.

ఇష్టపూర్వకంగా, ఆత్మీయంగా, నీతి మూలముగా ప్రజలు దేవుని వైపు తిరిగాలనే యేసుప్రభువు చెప్పిన బోధనానుసారంగా కాకుండ, క్రైస్తవ సంఘములోనికి రోమా ప్రభుత్వం- యొక్క మిలిటరీ భూతము (బలవంతపు మత మార్పిడి) చొరబడింది.

క్రైస్తవ సంఘము రోమా రాజ్యాన్ని జయించిందా అన్నట్టు కనిపించింది. కాని నిజానికి, క్రైస్తవ సంఘాన్ని రోమా రాజ్యపు మరురూపముగా మార్చి, రోమా రాజ్యమే క్రైస్తవ సంఘాన్ని జయించింది.

ఇతర పుస్తకములు కొరకు: Click Here

క్రైస్తవ సంఘానికి మత భ్రష్టత్వము

1. రాజకీయ సంస్థగా మారడం:

బలవంతపు మత మార్పిడి. వలన క్రైస్తవ సంఘము యొక్క నిజస్వరూపము మారిపోయింది. మత భ్రష్టత్వము చెందింది. సంఘము సార్వభౌమ (చక్రవర్తి సంబంధమైన) రోమా రాజ్యపు తత్వముతో, దాని పద్ధతులతో కూడిన రాజకీయ ఏర్పాటు (Political Organisation) గా మారిపోయింది. ఆది క్రైస్తవ సంఘము ” యొక్క లక్షణమే కోల్పోయి మత భ్రష్టత్వము చెంది, పోపు (Pope) సంబంధమైన దానిలో దిగి పోయింది.

మొదటి మూడు శతాబ్ధాలలో యేసుక్రీస్తు నిమిత్తమై హింసలకు గురియైన క్రైస్తవ సంఘమునకు, నాలుగైదు శతాబ్ధాలలో ఏర్పాటైన సార్వభౌమ సంఘము (రోమా చక్రవర్తి సంబంధమైన సంఘము) చాల విభిన్నంగా వుంది.

2. ఆరాధనలో మార్పు : పరిపాలించాలనే కోరికతో, క్రీస్తు తత్వాన్నే మరిచి

పోయింది, పోగొట్టుకుంది. ఆరాధనలు మొదట చాల సామాన్యంగా ప్రారంభమైనప్పటికి, పోను పోను, చాల శృంగారింపబడినవి గాను, గంభీరముగాను, అన్యదేవతాలయాలలో జరిగే బహిరంగ డాంభికముతో కూడిన వేడుకలుగా రూపు దాల్చినవి.

3. గురువులు (Priests) ప్రవేశం:

క్రీ.శ. 200 సం॥లకు ముందు “గురువు” లేక “పాదిరి” అనే మాట క్రైస్తవ పరిచారకులకు చెందినది కాదు. అన్యమతముల అర్చకత్వము నుండి, యూదుల పద్ధతుల నుండి తెచ్చుకున్న మాట ఇది.

JOSHUA BOOK TELUGU
యెహోషువ గ్రంథము – ప్రారంభము: Edward Williams Books PDF

ఒకటవ లియో చక్రవర్తి (Leo I) (AD 400-461) గురువులు పెళ్ళి చేసుకొనుటను నిషేధించాడు. గురువులు బ్రహ్మచర్యమును పాటించాలనేది రోమా సంఘపు చట్టము (Law) అయింది.

ఆ తర్వాత, అసభ్యకరమైన అడవి జాతివారు మోటువారు (చదువు రానివారు), అనాగరికులు, క్రూరులు క్రైస్తవ మతాన్ని అంగీకరించడం జరిగింది. కాని వీరి మార్పు, నామమాత్ర మైనందున (పేరుకు మాత్రమే క్రైస్తవులు) సంఘము అన్యమతాచారములతో నిండి పోయింది.

క్రైస్తవము రాచరికపు మతమైనందువల్ల గురువులు గొప్ప హోదాను కలిగి, సమాజములో విలాస జీవితము జీవించుచుండిరి. ‘రోము’లో ఉండే గురువు రాజ మర్యాదలు పొందేవాడు. గురువులు కౌన్సిలుగా ఏర్పడి మతములో వచ్చే అవాంతరాలను ఎలా సరిచెయ్యాలో తీర్మానించేవాళ్ళు. ఆ విధంగా కౌన్సిల్సు అధికారికమైనవిగా తయారయ్యాయి.

పెద్ద పట్టణాల్లో ఉండే గురువులు ఎక్కువ పనులు చేసేవారు. తుదకు పెద్ద పట్టణంలో ఉండే బిషప్ (Bishop) ఇతర పట్టణాల్లో ఉండే వారి మీద అధికారికమైన గురపీఠాధ్యక్షులుగా ఉండునట్లు 341సం||లో అంతియొకయలోని కౌన్సిలు ఏర్పాటు చేసింది.

4. పోప్ (Pope):

ఆ సమయంలో రోమ్లో ఉన్న బిషప్ ముఖ్య పట్టణంలో గుర్తించబడినవాడైనప్పటికి పెద్ద పలుకుబడి గలవాడు కాదు. అందువలన రోమ్ రాజకీయ సమస్యలలో ఉన్నపుడు సహాయపడినందుకుగాను ఇన్నోసెంట్ I (Innocent I) అనే బిషప్ (402-417 AD) ” (Pope) .

ఇప్పటికి ఇక్కడ అగి, మత్తయి సువార్త 23 అధ్యాయం 8 వచనము నుండి 12 వరకు చదవండి. ఆ వచనాలలో యేసుప్రభువు చెప్పిన మాటలు ఈ విధంగా ఉన్నాయి.

"మీరైతే బోధకులని పిలువబడవద్దు. ఒక్కడే మీ బోధకుడు. మీరందరు సహోదరులు. మరియు భూమి మీద ఎవనికైనను తండ్రియని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి. ఆయన పఠలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు.” 

కొనసాగింపు రెండవ భాగములో ఉంది. – రెండవ భాగము చదవండి.

Leave a Comment