Jesus 2nd Word Telugu: యేసు సిలువలో పలికిన 2 రెండవ మాట

యేసు సిలువలో పలికిన రెండవ మాట: “నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు” లూకా 23:43. ఈ రెండవ మాట సందర్భము ‘లూకా సువార్త 23:39-43’ వరకు ఉన్న వాక్యములో చూస్తాం.

ప్రారంభము: ఆ కాలములో రోమా రాజ్యములో శిక్షలు భయంకరముగా ఉండేవి. అందులో ఒకటి శిలువ శిక్ష. ఇది దొంగలకు, దేశ ద్రోహులకు, మరియు రోమా రాజ్యముకు వ్యతిరేకముగా ఉండువారికి ఈ శిక్ష వేస్తారు. అందులో యేసు ప్రభువును శిక్ష వేసే సమయములో మరో ఇద్దరు దొంగలు కూడా శిలువ వేయబడ్డారు. ఈ ఇద్దరు దొంగల మధ్య జరిగిన సంభాషణ ఈ రెండవ మాటలో ముఖ్యము.

యేసు పలికిన రెండవ మాట వివరణ: Jesus 2nd Word Telugu

మొదటి దొంగ:

ప్రభు తనను విశ్వసించిన వారికి ఇచ్చే రక్షణ నిశ్చయత గురించి ప్రకటించాడు. ఈ దృశ్యం ఎలా ఉందంటే యేసు ప్రభు తో పాటు సిల్వపై మరి ఇద్దరూ బందిపోటు దొంగలు  కూడా సిలువ వేయబడ్డారు.  అందులో  ఒకడు –  “నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి” (లూకా 23:37) అని వీకిలిగా మాట్లాడాడు.  అయితే తన పాపమును మాత్రం ఒప్పుకోలేదు.  రక్షకుడు ప్రక్కనే ఉన్న రక్షకుని  తిరస్కరించాడు. 

రెండవ దొంగ:

అయితే మరో దొంగ….  చెప్పాలంటే ఇది ఒక అద్భుతము ఆశ్చర్యము అని చెప్పాలి.  ఎందుకంటే ఈ దొంగ చివరి క్షణాల్లో,  మరికొద్ది సేపటిలో చనిపోతున్నాను అన్న సమయంలో ప్రభువు దగ్గర శరణు వేడాడు.  

వెక్కిరించిన మరియొక దొంగను మందలిస్తూ –  మనము చేసిన పనులకు తగిన శిక్షను మనం అనుభవిస్తున్నాము! మనకైతే ఇది న్యాయమే!  మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పు చేయలేదు.  అని ఆ వెకిలి మాట మాట్లాడిన దొంగతో చెప్పి…  తరువాత యేసు వైపు చూసి ఈ విధముగా అన్నాడు:  యేసు! నీ రాజ్యములోనీకీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను.

CHRISTIAN-CHURCH-HISTORY-TELUGU.
క్రైస్తవ సంఘ చరిత్ర: Christian Church History in Telugu

ప్రభువు స్పందన:

 “అందుకు యేసు ప్రభువు రెండవ దొంగ వైపు చూచి ‘నేడు నీవు నాతో కూడా పరదైసులో  ముందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను .”

ఈ కాన్వర్జేషన్,  సంభాషణలో నుండి కొన్ని ఆత్మీయ సత్యాలను పాఠాలను మనం నేర్చుకుందాం.

యేసు సిలువలో పలికిన రెండవ మాట: పాఠములు & సత్యములు

నీవు ఏ దొంగవు?

 ఇద్దరిలో ఒక దొంగ ప్రక్కననే ఉన్న రక్షణను త్రోసి వేశాడు.  కానీ మరో దొంగ రక్షణను స్వీకరించాడు.  రక్షణను పొందిన బందిపోటు దొంగ యొక్క జీవితం చూస్తే…  ప్రభువుతో రక్షణ గురించి,ప్రభు యొక్క రాజ్యం గురించి మాట్లాడాడు అని అంటే,  కచ్చితంగాఅంతకుముందే యేసు ప్రభు వారి గురించి తెలిసినవాడై ఉండాలి.  ఆయన ప్రకటించిన రాజ్యము గురించి తెలిసిన వాడే ఉండాలి. ప్రభువు తన రాజ్యములోనికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోని కోరడంలో ఒక  రాజ్యములోనికి ఆయన వస్తాడు. ఆ రాజ్యము ఆయనదే అని దొంగ గ్రహించాడు.  ఈరోజు అదే ప్రభువు బోధ విన్న నీవు ఆయనకు ఒక రాజ్యం ఉందని ఆ రాజ్యములో నేను కూడా చేరాలనే సంకల్పం, నిశ్చయత నీకు ఉందా?

పాపమును ఒప్పుకొనటం:

 మనకైతే ఇది న్యాయమే అని ఈ రెండవ దొంగ చెప్పినప్పుడు… బహుశా తన యొక్క తప్పులను తాను పొందిన శిక్షకు తగినది అని భావించి ఉంటాడు.  మనముతప్పు చేసినవారము కానీ ఈయన ఏ పాపము కూడా చేయలేదు అని చెప్పడంలో ప్రభువును పరిశుద్ధుడిగా శిలువపై దొంగ చూడగలిగాడు.  ప్రభువు పరిశుద్ధుడు అని ఎప్పుడైతే ఒక పాపి గ్రహిస్తాడో…  వెంటనే తన పాపమును అతను ఒప్పుకుంటాడు. శిలువ పైన ఉన్న దొంగలాగా.  ప్రభువు యొక్క మహాత్మ్యమును ఎరిగిన పేతురు –  ఓడలో యేసు ప్రభుతో, ప్రభువా! పాపాత్ముడునైన నన్ను విడిచిపొమ్మూ అని అన్నాడు. యెషయా  కూడా – ‘సింహాసనం మీద ఉన్న దేవుని చూసి…  ‘నేను అపవిత్రుడైన పెదవులు గలవాడును’ అని అన్నాడు.  గనుక సిలువ పైన ఉన్న దొంగ వలె నీవు నీ పాపమును ఒప్పుకోగలవా? పరిశుద్ధుడైన ఏసుక్రీస్తును నీ రక్షకుడని స్వీకరించగలవా? 

లభించిన రక్షణ:

 ఏ వ్యక్తి అయితే తన పాపమును ఒప్పుకుంటాడు ఆ వ్యక్తిని యేసు ప్రభు త్రోసి వేయడు అని ఏసుప్రభు ఇచ్చిన మాటను బట్టి అర్థమవుతుంది.  ఎంత ఘోర పాపిని అయినను క్షమించుటకు యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు.  సిలువలో ఆయన కార్చిన రక్తం 1 యోహాను 1:7 ప్రకారము –  ఆయన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని వాక్యము చెబుతోంది.  మీ పాపమును ఒప్పుకుంటే రక్షణ లభిస్తుంది. . ఆనాడు జక్కయ్య ప్రభువును అంగీకరించాడు చేర్చుకున్నాడు.  రక్షణ లభించింది.  ఈరోజు నీకు కూడా అదే రక్షణ లభిస్తుంది. . బందీపోటు దొంగకు ప్రభువు ఒక హామీ కూడా ఇచ్చాడు:  నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని.  చూడండి ఎంత భాగ్యము! 

yesu 1 word
Jesus 1st Word Telugu – యేసు సిలువలో పలికిన 1 మొదటి మాట

నిర్లక్ష్యమైన రక్షణ:

 అదే సమయంలో ప్రక్కనే రక్షకుడిని ఉంచుకొని,  రక్షణను పొందలేకపోయాడు మొదటి బందిపోటు దొంగ.  రక్షకుడిని అవహేళనగా అపహాస్యముగా మాట్లాడాడు.  కనుక దేవుడు నీకు దొరికినప్పుడే,  అందుబాటులో ఉన్నప్పుడే,  ఆయనను స్వీకరించుట ఎంతో అవసరం. ‘ఇదే మిక్కిలి అనుకూల సమయము,  ఇదే రక్షణ దినము అని 2 కొరింథి  6:2 చెబుతుంది.  ప్రభువును చేర్చుకుంటావా త్రోసివేస్తావా నిర్ణయం నీదే! 

హెచ్చరిక మరియు ముగింపు:

 ఆనాడు చివరి దశలో దొంగ రక్షించబడ్డాడు కదా అని,  నేను కూడా చివరి జీవితంలో రక్షణలోనికి వస్తాను,  ఇప్పుడు పాపములు చేసుకుంటూ ముందుకు వెళ్తాను,  రేపు అనే దినం ఉంది కదా ఇప్పుడు ఆనందిస్తాను అని అనుకుంటే…  బహుశా రేపు ఉంటుందేమో కానీ,  ఆ రేపటి రోజున మనం ఉండకపోవచ్చు.  ఎవరి ప్రాణం ఎప్పుడు వెళ్తుందో ఎవరికీ తెలియదు.  కనుక, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకొనుట ఉత్తమం.  నీ రక్షకుడి యొద్దకు పరుగులు తీయడం శ్రేయస్కరం.  

ప్రభు ఏసు క్రీస్తు –  మనకు ఇచ్చే భరోసా ఇదే:  నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు!  నా రాజ్యంలో నీవు ఉంటావు! అని.  గనుక నిర్లక్ష్యం చేయక ప్రభువు వద్దకు పరిగెత్తము.  దొంగ వలె పాపమును ఒప్పుకో…  కనికరం కలిగిన దేవుడు క్షమిస్తాడు.  ఆయనతో కూడా సదాకాలము పరదేశిలో ఉంటావు.  ఆమెన్

Leave a Comment