థియోలజి: దైవశాస్త్రము (The Doctine of God)

క్రైస్తవ వేదాంత శాస్త్రములలో అత్యంత ప్రాముఖ్యమైనది, గంభీరమైన మరియు ప్రాథమికమైన అంశములో మొదటిది “థియోలజి ప్రాపర్” (Theology Proper). అనగా పితృదేవ శాస్త్రము/ తండ్రియైన దేవుని శాస్త్రము అని పిలుస్తారు. దైవశాస్త్రం (Theology) అనే విశాలమైన వృక్షంలో అనేక విభాగాలు ఉన్నప్పటికీ, దేవుని అస్తిత్వం, ఆయన వ్యక్తిత్వం, స్వభావం, అపరిమిత గుణాతిశయాలు మరియు సృష్టితో ఆయనకు ఉన్న సంబంధాన్ని గురించిన ప్రత్యక్ష అధ్యయనమే ‘థియోలజి ప్రాపర్’. ఇది కేవలము మొదటి భాగము మాత్రమే.

Table of Contents

1. దైవశాస్త్ర అధ్యయన ఉద్దేశం మరియు ప్రాథమిక పునాది

దైవశాస్త్రాన్ని అధ్యయనం చేయడం అనేది కేవలం మానసిక జ్ఞాన సముపార్జన లేదా ఒక విద్యా విషయక వ్యాపకం కాదు. దైవశాస్త్ర పఠనం వెనుక అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయోజనం అంతర్లీనంగా ఉంటుంది. చెప్పాలంటే ప్రతి క్రైస్తవుడు కచ్చితంగా నేర్చుకొనవలసిన అంశము ఇది.

దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవాలి?

ప్రముఖ దైవశాస్త్రవేత్త జే.ఐ. ప్యాకర్ (J.I. Packer) తన ప్రామాణిక గ్రంథాలలో పేర్కొన్నట్లుగా, దేవుని గూర్చిన జ్ఞానంలో ఎదగడం వెనుక ఒకే ఒక ప్రధాన లక్ష్యం ఉంది:

“దేవుడు అంటే నీ ఉద్దేశ్యములో ఏమిటి? ఎవరు? లేక ఆయనతో నీకేమి సంబంధము?

“What do you mean when you say God? Or who or what is God to you?

దేవుని గురించిన అధ్యయనం అనేది సిద్ధాంతపరమైన విషయాలను సేకరించడానికి కాదు, కానీ సృష్టికర్తయైన దేవునికి మానవుడు సమర్పణతో విధేయత చూపడానికి మాత్రమే ఈ అధ్యానము. ఈ దివ్యమైన అధ్యయనం సాధ్యపడటానికి ప్రాథమికమైన నమ్మకం ఒకటి అవసరం — “దేవుడు తనను తాను మానవులకు తెలియజేసుకోవడానికి సమ్మతించాడు” (A genuine belief that God will allow Himself to be known) అనే అచంచలమైన విశ్వాసం. దేవుడే గనుక తనను తాను బయలుపరచుకోకపోతే, అపరిమితుడైన దేవుణ్ణి పరిమితుడైన మానవుడు తన స్వయంశక్తితో ఏమాత్రం గ్రహించలేడు ఎప్పటికీ!

నీకు నువ్వు ఎవరో తెలియాలంటే – నీ నమ్ముతున్న దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకో! ; నీకు నీవు అర్థం కావాలంటే – దేవుణ్ణి అర్థము చేసుకో

దైవ గ్రంథ ప్రామాణికత (Scriptural Authority)

క్రైస్తవ విశ్వాసమంతయూ ఒక ప్రాథమిక సత్య గ్రంథము బైబిల్ మీద ఆధారపడి ఉంది. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మరియు పవిత్రమైన పరిశుద్ధ గ్రంథము (బైబిల్) ద్వారా తనను తాను స్పష్టంగా బయలుపరిచాడు.

  • దేవుని ప్రేరణ (Divine Inspiration): బైబిల్ మానవ ఆలోచనల సమాహారం కాదు, అది దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా రాయబడిన దైవవాక్యము.
  • నిర్దోషత్వము (Inerrancy): దైవావేశము వలన కలిగినది గనుక మూల ప్రతిపాదనలలో ఇది ఎటువంటి పొరపాట్లు లేని సంపూర్ణ సత్యము.
  • అత్యున్నత అధికారము (Authoritative Status): మానవుని ఆధ్యాత్మిక, నైతిక, సిద్ధాంత జీవితానికి బైబిలే అత్యున్నత మరియు ఆఖరి అధికారిక ప్రమాణము.

ఇది మనము నమ్మితేనే… బైబిల్ లో ఉన్న దేవుని యొక్క గుణసత్యములను, ఉనికిని, అస్తిత్వమును మరియు ఇతర దేవుని లక్షణములను నమ్మగలము.

2. దేవుని గూర్చిన వివిధ ప్రపంచ దృక్పథాలు (Worldviews Concerning God)

ఒకవేళ దేవుని గురించి, బైబిల్ గురించి లేదా ఆధ్యాత్మిక విషయాల గురించి ఏమాత్రం అవగాహన లేని ఒక సామాన్య ప్రజలను దేవుణ్ణి ఎలా నిర్వచిస్తారు లేదా వివరిస్తారు? అని అడిగితే… ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చే ప్రజలు రకరకములుగా జవాబు ఇస్తారు. ముందుగా వారి అవగాహనలను (opinion) తెలుసుంటే… ఆ ప్రజలు అర్థము చేసుకున్న దేవుణ్ణికి(దేవుళ్లకు) & మన దేవునికి మధ్య ఉన్న వ్యత్యాసం (తేడా) అర్థమవుంది. ఈ వ్యతాసం ఆరాధనకు నడిపిస్తుంది.

దేవుని గురించిన ప్రధాన ప్రపంచ దృక్పథాలు (Worldviews about God)  

1. సర్వేశ్వరవాదం (Pantheism)

  • నిర్వచనం: “దేవుడే సమస్తము, సమస్తమూ దేవుడే” (God is everything and everything is God) అనే నమ్మకం.
  • స్వభావం: ఈ దృక్పథంలో దేవునికి, సృష్టికి మధ్య వ్యత్యాసం ఉండదు. ప్రకృతి, విశ్వము మరియు అందులోని ప్రతి పదార్థము దేవుని రూపమేనని ఇది ప్రతిపాదిస్తుంది. ఇక్కడ దేవుడు వ్యక్తిత్వము కలిగిన రూపం కాదు, ఒక సార్వత్రిక శక్తి మాత్రమే.

2. బహుదేవతారాధన (Polytheism)

  • నిర్వచనం: విశ్వంలో అనేకమంది దేవుళ్ళు ఉన్నారని నమ్మడం.
  • స్వభావం: ఈ నమ్మకంలో విభిన్న శక్తులు, విభిన్న బాధ్యతలు కలిగిన అనేకమంది దేవతలు ఉంటారు. వీరిలో కొందరు దేవుళ్ళు మిగిలిన వారి కంటే ఎక్కువ ప్రాముఖ్యత, శక్తి లేదా అధికారం కలిగి ఉంటారని భావిస్తారు.

3. ఆచార సమ్మేళనవాదం/సర్వాంగీకార వాదము (Syncretism)

  • నిర్వచనం: విభిన్న సిద్ధాంతాలను, పరస్పర విరుద్ధమైన నమ్మకాలను మరియు వివిధ దేవుళ్ల ఆరాధనా పద్ధతులను సమ్మేళనం చేసి ఒక నూతన వ్యవస్థగా మార్చడం.
  • స్వభావం: ఏ ఒక్క సత్యాన్ని సంపూర్ణమైనదిగా అంగీకరించకుండా, అన్ని మార్గాలు మరియు దేవుళ్ళు ఒకటేననే భావనతో రకరకాల విశ్వాసాలను ఉపరితల మట్టంలో కలిపివేసే ధోరణి ఇది.

4. నాస్తికవాదం (Atheism)

  • నిర్వచనం: దేవుడు లేదా ఏ విధమైన దైవిక శక్తుల ఉనికిని సంపూర్ణంగా నిరాకరించే నమ్మకం.
  • స్వభావం: ఈ దృక్పథంలో భౌతిక ప్రపంచం మరియు పదార్థం మాత్రమే సత్యం. విశ్వం యాదృచ్ఛికంగా ఆవిర్భవించిందని, దీని వెనుక ఎలాంటి సృష్టికర్త లేదా దైవిక ప్రణాళిక లేదని భావిస్తారు.

5. అజ్ఞేయవాదం (Agnosticism)

  • నిర్వచనం: దేవుని ఉనికిని మానవుని పరిమిత జ్ఞానంతో తెలుసుకోవడం అసాధ్యమని భావించే నమ్మకం.
  • స్వభావం: దేవుడు ఉన్నాడని గానీ, లేడని గానీ ఖచ్చితంగా చెప్పలేమనే సంశయాత్మక ధోరణి ఇది. తగిన ఆధారాలు లేనిదే దేవుని గూర్చిన ఏ ముగింపుకూ రాకూడదని ఇది ప్రతిపాదిస్తుంది. సులువుగా చెప్పాలంటే దేవుడు ఉన్నాడు అనుటకు Proof అడుగుతుంది.

6. ప్రకృతి దైవవాదం / సృష్టి కర్తృత్వ వాదము (Deism)

  • నిర్వచనం: దేవుడు విశ్వాన్ని సృష్టించాడని అంగీకరిస్తూనే, సృష్టి తర్వాత ఆయన దానికి దూరంగా ఉండిపోయాడనే నమ్మకం.
  • స్వభావం: దేవుడు విశ్వాన్ని ఒక గడియారంలా తయారుచేసి, కొన్ని సహజ నియమాలను అమర్చి వదిలేశాడు. దేవుడు విశ్వాతీతుడు (Transcendent) మాత్రమే, కానీ సృష్టికార్యాల్లో నిరంతరం జోక్యం చేసుకోడు (Not Immanent).

7. ఏకప్రాధాన్య బహుదేవతావాదం (Henotheism)

  • నిర్వచనం: అనేకమంది దేవుళ్ళ ఉనికిని అంగీకరిస్తూనే, ఒక నిర్దిష్ట దేవుణ్ణి మాత్రమే ఆరాధ్యదైవంగా పూజించే నమ్మకం.
  • స్వభావం: ఇతర దేవుళ్ళు ఉన్నారనే విషయాన్ని నిరాకరించకుండా, తమ తెగకు, కులానికి లేదా ప్రాంతానికి చెందిన ఒక దేవునికి మాత్రమే అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం దీని ప్రత్యేకత.

8. ఏకదేవతావాదం (Monotheism)

  • నిర్వచనం: విశ్వానికంతటికీ సృష్టికర్తయైన దేవుడు ఒక్కడేనని నమ్మడం.
  • స్వభావం: ఈ దృక్పథంలో దేవుడు ఒక్కడే సత్యవంతుడు. ఆయన వ్యక్తిత్వము కలిగిన విశ్వాతీతుడు (Transcendent) మరియు నిరంతరం తన సృష్టితో అనుబంధం కలిగి ఉండే సమీపస్థుడు (Immanent). ఆయనే సమస్తానికి సృష్టికర్త, పరిపాలకుడు మరియు పోషకుడు.

9. ద్వైతవాదం (Dualism)

  • నిర్వచనం: విశ్వంలో సమానమైన మరియు పరస్పర విరుద్ధమైన రెండు దైవిక శక్తులు నిరంతరం ఉనికిలో ఉంటాయని నమ్మడం.
  • స్వభావం: మంచి మరియు చెడు, వెలుగు మరియు చీకటి అనే రెండు స్వతంత్ర శక్తులు నిరంతరం పోరాడుతుంటాయని, ఈ రెండింటికీ సమానమైన శక్తి మరియు ప్రాధాన్యత ఉంటుందని ఇది ప్రతిపాదిస్తుంది.

10. మత బహుత్వవాదం (Pluralism)

  • నిర్వచనం: అన్ని మతాలు, విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక మార్గాలు సమానమైన సత్యాన్నే అందిస్తున్నాయని భావించే నమ్మకం.
  • స్వభావం: దేవుణ్ణి చేరుకోవడానికి విభిన్న మతాలు వేర్వేరు మార్గాలు మాత్రమేనని, ప్రతి మతం ద్వారా లభించే దైవజ్ఞానం సమానంగా సరైనదేనని ఇది పేర్కొంటుంది. ఏ దేవుడిని నమ్మినా… ఒక్కటే అని చెప్పే వాదము ఇది.

3. దేవుని గూర్చిన జ్ఞానానికి మూలాధారాలు (Possible Sources of Knowledge of God)

మనం దేవుని గురించి తెలుసుకోవడానికి అందుబాటులో ఉన్న మార్గాలు లేదా ఆధారాలు ఏమిటి? దైవశాస్త్రం ప్రకారం దేవుని జ్ఞానాన్ని అందించే ఆధారాలను మూడు ముఖ్య విభాగలుగా వర్గీకరించవచ్చు.

బైబిల్
బైబిల్ ని ఎలా అర్థము చేసుకోవాలి? – పాతనిబంధన విశ్లేషణ: How to understand the Bible

దేవుని జ్ఞానానికి మూలాధారాలు

1. సంప్రదాయము మరియు అనుభవము (Tradition and Experience)

  • వివరణ: గత చరిత్రలో దైవజనులు, సంఘ పితరులు, మరియు దైవశాస్త్రవేత్తలు దేవుని గురించి ఏమి చెప్పారు, ఏమి అనుభవించారు, మరియు ఏ ముగింపులకు వచ్చారో తెలియజేసే ఆధారం ఇది.
  • అంశాలు: ఇందులో ప్రాచీన సంఘ విశ్వాస ప్రమాణాలు (Creeds), విశ్వాస ప్రకటనలు (Confessions of Faith), మరియు సంఘ సాంప్రదాయాలు అంతర్భాగంగా ఉంటాయి.
  • పరిమితి: మానవ అనుభవాలు మరియు సాంప్రదాయాలు అమూల్యమైన అవగాహనను ఇచ్చినప్పటికీ, అవి మానవ బలహీనతలకు లోబడి ఉండే అవకాశం ఉంది.

గనుక, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన సంప్రదాయములు మరియు అనుభవముల చేత తనను గూర్చన జ్ఞానమును బయలుపరిచాడు. (ఉదా: పస్కా పండుగా)

2. సాధారణ ప్రకటన (General Revelation)

  • వివరణ: దేవుడు మానవులందరికీ అర్థమయ్యే రీతిలో, ప్రకృతి మరియు సృష్టి ద్వారా తన నిత్యశక్తిని, దైవత్వాన్ని వెల్లడి చేయడం. (రోమా 1)
  • ఆధారాలు:
    • సృష్టి నైపుణ్యం: విశ్వంలోని క్రమము, గ్రహాల గమనం, జీవజాలాల నిర్మాణం దేవుని అద్భుతమైన జ్ఞానాన్ని చాటుతాయి.
    • నైతిక వ్యవస్థ: ప్రతి మానవుని హృదయములో ఉండే నైతిక మనస్సాక్షి (Conscience) మంచి-చెడుల వ్యత్యాసాన్ని తెలియజేస్తూ సృష్టికర్త పవిత్రతను సూచిస్తుంది.

3. ప్రత్యేక ప్రకటన (Special Revelation)

  • వివరణ: దేవుడు నిర్దిష్టమైన రీతిలో, సత్యవంతంగా తన చిత్తాన్ని, స్వభావాన్ని మరియు రక్షణ ప్రణాళికను మానవాళికి వెల్లడి చేయడం.
  • ఆధారాలు: పవిత్ర దైవ గ్రంథమైన బైబిల్, యేసుక్రీస్తు శరీరధారిగా భూమిపైకి రావడం, మరియు మానవులకు జ్ఞానాన్ని అనుగ్రహించే పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య.
థియోలజి

ఏ ఆధారం అత్యంత విశ్వసనీయమైనది మరియు కచ్చితమైనది? ఎందుకు?

ఈ మూడింటినీ పోల్చి చూసినప్పుడు, ప్రత్యేక ప్రకటన (Special Revelation – దైవ గ్రంథము మరియు పరిశుద్ధాత్మ) మాత్రమే అత్యంత విశ్వసనీయమైనది మరియు కచ్చితమైనది.

  • కారణం: మానవ సంప్రదాయాలు మరియు అనుభవాలు కాలక్రమేణా మార్పు చెందవచ్చు లేదా పొరపాట్లకు లోనుకావచ్చు. ప్రకృతి ద్వారా కలిగే సాధారణ ప్రకటన దేవుడు ఉన్నాడనే సత్యాన్ని తెలియజేస్తుంది గానీ, ఆయన రక్షణ ప్రణాళికను, ప్రేమను సంపూర్ణంగా వివరించలేదు. అయితే దేవుని ఆత్మచే ప్రేరేపించబడి రాయబడిన దైవగ్రంథం ఎటువంటి లోపం లేనిది (Inerrant). పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసి మనస్సును వెలిగించి, దైవసత్యాన్ని అపభ్రంశం కాకుండా హృదయానికి చేరవేస్తాడు. కాబట్టి ప్రత్యేక ప్రకటన మాత్రమే దైవజ్ఞానానికి అంతిమ ప్రమాణం.

4. దేవుని స్వరూపంలో మానవుడు మరియు ఆధ్యాత్మిక అనుబంధం (Imago Dei)

దేవునికి మరియు మానవునికి ఉన్న దైవిక సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ‘ఇమాగో డీ’ (Imago Dei – God made man in His own image) అనగా దేవుడు మానవుడిని తన సొంత స్వరూపంలో సృష్టించాడు అనే సిద్ధాంతం అత్యంత ప్రాధాన్యమైనది.

దేవుని స్వరూపం అనగానేమి?

మానవుడు దేవుని స్వరూపంలో సృష్టించబడడమనేది శారీరక రూపాన్ని బట్టి కాదు. దేవుడు ఆత్మయై యున్నాడు. కాబట్టి, ఈ దైవస్వరూపం అనేది మానవునికి అనుగ్రహించబడిన దైవిక గుణాలు మరియు ఆధ్యాత్మిక సమర్థతలను సూచిస్తుంది.

దేవుడు మానవునికి తనతో సంబంధం కలిగి ఉండటానికి, సృష్టిపై ఆధిపత్యం (Domination/Dominion) చెలాయించడానికి నాలుగు ముఖ్యమైన ఆంతరంగిక లక్షణాలను ప్రసాదించాడు:

  1. మనస్సు (Mind): ఆలోచించే శక్తి, సత్యాన్ని గ్రహించే సామర్థ్యం, దైవిక విషయాలను విశ్లేషించే జ్ఞానము.
  2. చిత్తము (Will): స్వయం నిర్ణయాధికారము, మంచి-చెడుల మధ్య ఎంపిక చేసుకునే స్వేచ్ఛ.
  3. భావోద్వేగాలు (Emotions): ప్రేమించడం, ఆనందించడం, పరిశుద్ధమైన కోపం కలిగియుండడం వంటి ఆత్మీయ భావాలు.
  4. వ్యక్తిత్వము (Personality): తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తించబడుతూ, దేవునితోనూ, తోటి మానవులతోనూ సంబంధాలు ఏర్పరుచుకునే సామర్థ్యం.

పరిశుద్ధాత్మ దేవుని పాత్ర

మానవునికి ఈ సామర్థ్యాలు ఉన్నప్పటికీ, పాపము వలన మానవ బుద్ధి కలషితమైంది. అందుకే దేవుడు మనకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసి అంతరంగంలో నివసించడం ద్వారా మాత్రమే దేవుని గూఢమైన విషయాలను గ్రహించే, అర్థం చేసుకునే మరియు అనుభవించే ఆధ్యాత్మిక వివేచన లభిస్తుంది.

థియాలజి గురించి లోతుగా అధ్యనము చెయ్యాలనుకుంటే ఇక్కడ చూడండి.

5. దేవుని ఉనికికి నైసర్గికి మరియు తార్కిక వాదనలు (Naturalistic Arguments for God’s Existence)

దేవుని ఉనికి కేవలం గ్రంథాలకే పరిమితం కాకుండా, తార్కిక ఆలోచనల ద్వారా (Logical Arguments) కూడా రుజువు చేయబడుతుంది. అవి ఏమిటో చూద్దాం!

1. Cosmological Argument (కాస్మోలాజికల్ వాదన):

aఈ వాదన విశ్వం యొక్క ఉత్పత్తి మరియు కారణ-కార్య సంబంధం (Cause and Effect) మీద ఆధారపడి ఉంది. దీనిని బలముగా Thomos Acquinus అను ఆయన ప్రతిపాదించాడు.

  • అనిత్యమైన ఉనికి (Contingent Being): ఈ విశ్వంలో కనిపిస్తున్న ప్రతి వస్తువు లేదా జీవి “అనిత్యమైనది” (Contingent). అంటే, దాని ఉనికి మరొకదానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఒక చెట్టు విత్తనం మీద, నీటి మీద ఆధారపడి ఉద్భవిస్తుంది. అది స్వయంభవమునవి కాదు.
  • తార్కిక ముగింపు: విశ్వంలోని ప్రతిదీ ఆధారపడి ఉద్భవించినదే అయితే, ఈ విధివిధానాన్ని వెనక్కి తీసుకువెళ్తే, ఎవరిపైనా ఆధారపడకుండా, నిత్యుడై, సమస్తానికి నాందిగా ఉన్న ఒక “ఆవశ్యక ఉనికి” (Necessary Being) ఉండక తప్పదు.
  • సిద్ధాంత సారం: స్వయంగా ఉనికి కలిగి ఉండి, మిగిలిన సమస్తానికి ఉనికిని ప్రసాదించిన ఆ మొదటి కారణమే (Uncaused Cause) దేవుడు.

[అనిత్యమైన సృష్టి (Contingent Universe)] ──(కారణం వెతుక్కుంటూ పోతే)──► [ఆవశ్యకమైన నిత్య ఉనికి (Necessary Being = దేవుడు)]

2. Teleological Argument (టెలియోలాజికల్ వాదన):

విశ్వంలో కనిపించే అద్భుతమైన డిజైన్, శృంఖల క్రమము మరియు ప్రయోజనకారిత్వాన్ని బట్టి దేవుని ఉనికిని నిరూపించే వాదన ఇది.

  • సృష్టి శిల్పి (Nature Designer): ప్రకృతులలోని ప్రణాళిక యాదృచ్ఛికంగా ఏర్పడింది కాదు. గ్రహాల భ్రమణం, భూమిపై జీవం నిలవడానికి అవసరమైన వాతావరణ సమతుల్యత, డి.ఎన్.ఎ (DNA) లోని సంక్లిష్టమైన సమాచారం, ఆకర్షణ శక్తి — ఇవన్నీ అత్యున్నతమైన జ్ఞానము కలిగిన ఒక రూపకర్త (Designer) ఉనికిని చాటుతున్నాయి. ఎందుకు అనగా ప్రకృతి నడుస్తుంది అంటే… నడిపించువాడు వెనుక ఉన్నాడు అని అర్థము. ( ఉదా: ఒక స్కూటర్ ముందుకు వెళ్లాలి అంటే, నడిపే వాడు ఉండాలి)

వచనములు: ఆది 1:1-27/ కీర్తనలు 19:1/ యోబు 38:1-7/ రోమా 1:19,20

SILUVALO-RENDAVA-MATA
Jesus 2nd Word Telugu: యేసు సిలువలో పలికిన 2 రెండవ మాట

3. The Watchmaker Argument (వాచ్‌మేకర్ సిద్ధాంతం):

విలియం పేలీ (William Paley) ప్రతిపాదించిన ఈ వాదన దేవుని ఉనికిని అత్యంత సులభంగా వివరిస్తుంది:

“మీరు ఒక నిర్జనమైన అడవి గుండా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, కాలుకు ఒక రాయి తగిలితే, ఆ రాయి అక్కడ ఎప్పటి నుంచో ఉండి ఉంటుందని అనుకోవచ్చు. కానీ, అదే ప్రదేశంలో ఒక అద్భుతమైన చేతి గడియారం (Pocket Watch) కనిపిస్తే, మీరు ఏమనుకుంటారు? ఆ గడియారం లోని చక్రాలు, స్ప్రింగులు, మరియు కాలక్రమాన్ని చూపించే వ్యవస్థను చూసి, ‘ఇది యాదృచ్ఛికంగా ఇక్కడ తయారై పడిఉంది’ అని ఎవరూ అనుకోరు. దానిని ఎంతో నైపుణ్యంతో తయారుచేసిన ఒక గడియారపు తయారీదారుడు (Watchmaker) ఉన్నాడు అని కచ్చితంగా ఉండి తీరాలని తర్కిస్తారు.”

  • అప్లికేషన్: ఒక చిన్న గడియారానికే తయారీదారుడు అవసరమైతే, గడియారం కంటే కోట్లాది రెట్లు సంక్లిష్టమైన, అనంతమైన ఈ విశ్వానికి దేవుడనే మహా సృష్టికర్త (Intelligent Designer) ఎంతైనా ఆవశ్యకం!

4. Ontological Argument (ఆంతోలాజికల్ ఆర్గ్యుమెంట్):d

దీనిని Yansmel అను వేదాంతి ప్రదిపాదించాడు.

దాదాపు ప్రతి మనిషి మనస్సులోనూ ఒక భావన ఉంటుంది; సమస్తానికీ పరిపూర్ణమైన ఆది కారణం అయిన ఆ పరిపూర్ణత నుండే ఆ భావన మనిషికి వెలుపలి నుండి వచ్చి ఉండాలి.

వచనములు: ఆది 3:5/ యెషయ 55:8,9/ కీర్త 14:2/ ద్వితి 32:4/ ప్రసంగి 3:11/ అప్పో 17:24-28

6. సంక్షిప్త పోలికల పట్టిక (Comparative Analysis Table)

థియోలజి ప్రాపర్ లోని ప్రధాన సిద్ధాంత పరమైన వ్యత్యాసాలను అర్థం చేసుకోవడానికి ఈ క్రింది పట్టిక ఉపయోగపడుతుంది:

అంశము (Category)విభిన్న దృక్పథాలు / రకాలుప్రధాన సూత్రం (Core Principle)దైవశాస్త్ర ముగింపు (Theological Conclusion)
ప్రపంచ దృక్పథాలుసర్వేశ్వరవాదం (Pantheism)దేవుడు = సృష్టిదేవునికి వ్యక్తిత్వం లేదు; ఇది బైబిల్ విరుద్ధం.
బహుదేవతారాధన (Polytheism)అనేకమంది దేవుళ్ళుదైవిక శక్తి వికేంద్రీకరణ; సత్యానికి దూరమైనది.
క్రైస్తవ ఏకదేవతావాదంఏకైక దేవుడు (Transcendent & Immanent)సృష్టికర్త ఒక్కడే; ఆయన సర్వాధికారి.
జ్ఞాన మూలాధారాలుసంప్రదాయం & అనుభవంగత చరిత్ర, క్రీడ్స్సహాయకమైనది, కానీ పొరపాట్లకు అవకాశం ఉంది.
సాధారణ ప్రకటనప్రకృతి, నైతిక మనస్సాక్షిదేవుని ఉనికిని చాటుతుంది; రక్షణను వివరించలేదు.
ప్రత్యేక ప్రకటనబైబిల్, పరిశుద్ధాత్ముడుఅత్యంత విశ్వసనీయమైనది మరియు సంపూర్ణమైనది.
తార్కిక వాదనలుకాస్మోలాజికల్ వాదనCause & Effect (కారణ-కార్యం)దేవుడే ‘ఆవశ్యకమైన నిత్య ఉనికి’ (Necessary Being).
టెలియోలాజికల్ వాదనDesign & Order (క్రమము-డిజైన్)దేవుడే అంత్యంత జ్ఞానము కలిగిన రూపకర్త (Designer).

7. ముగింపు మరియు ఆత్మీయ అన్వయింపు

థియోలజి ప్రాపర్ (Theology Proper) అనే దైవశాస్త్ర విభాగం కేవలం సిద్ధాంత చర్చల సముదాయం కాదు. ఇది విశ్వాసి యొక్క అంతరంగ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే జీవము కలిగిన సత్యం. నీవు నమ్మిన దేవుణ్ణి నీవు తెలిసికున్నప్పుడే నీవు ఎవరో నీకు అర్థము అవుతుంది.

ముఖ్య పాఠాలు:

  1. వినియోగం స్పష్టమైన విధేయత కొరకే: దేవుణ్ణి గూర్చి మనం నేర్చుకునే ప్రతి సత్యం ఆయన పట్ల మన భయభక్తులను పెంచాలి. ఆయన సర్వాధికారాన్ని అంగీకరించి, మన జీవితాలను ఆయన చిత్తానికి సంపూర్ణంగా అప్పగించడమే నిజమైన దైవశాస్త్ర అధ్యయన ఫలితం.
  2. వాక్య ప్రామాణికత: మానవ భావోద్వేగాలు, సంప్రదాయాల కంటే దేవుని ప్రేరణ ద్వారా ఇవ్వబడిన దైవ గ్రంథానికే (బైబిల్) మన జీవితాల్లో అత్యున్నత పీఠం వేయాలి.
  3. ఆధ్యాత్మిక ప్రతిబింబం: మనం దేవుని స్వరూపంలో, ఆయనతో దైవిక సంబంధం కలిగి ఉండటానికే సృష్టించబడ్డాము. మన మనస్సు, చిత్తము, భావోద్వేగాలు మరియు వ్యక్తిత్వాన్ని దేవుని మహిమార్థమై ఉపయోగించినప్పుడే మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది.

దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్న దేవుడు. ఆయన విశ్వానికి అతీతుడైన మహోన్నతుడు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో నివసించే సమీపస్థుడు. ఈ థియోలజి ప్రాపర్ అధ్యయనం ద్వారా దేవుని అపరిమిత స్వభావాన్ని గ్రహించి, ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆరాధించుటకు విశ్వాసులు పిలవబడ్డారు.

ఈ వివరణ ఇంకా పూర్తికాలేదు. ఇది మొదటి భాగము మాత్రమే. రెండవ భాగము త్వరలో…

Leave a Comment