Jesus 1st Word Telugu – యేసు సిలువలో పలికిన 1 మొదటి మాట

ప్రభువు నందు ప్రియులారా చరిత్రలో పలుకుబడిన మాటల్లో అసాధారణమైన మాటలు యేసు సిలువపై పలికిన ఏడు మాటలు.  అందులో ఈరోజు మొదటి మాటను ధ్యానిద్దాం.

 తండ్రి! వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. గనుక వీరిని క్షమించు -  లూకా 23:34 

ప్రారంభం

ఈ మాట ముఖ్యముగా క్షమాపణ గురించి తెలియజేస్తుంది బాధలో ఉన్న వ్యక్తి సహజంగా ప్రాణభిక్ష కావాలని లేదా నన్ను విడిపించండి అన్నట్లుగా కోరుతాడు. కానీ ఏసుప్రభు మాత్రం ఎదుటి వ్యక్తి కొరకు క్షమాపణ కోరుతున్నాడు. సహజంగా ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు న్యాయం కావాలని లేదా తనలో తప్పులేదు అని నిరూపించుకోవడం లేదా రక్షించండి క్షమించండి అని అడగడం కోరుతాడు.   ఇది వినటానికి విచిత్రంగా ఉన్న నిజము. 

ఏసుప్రభువును గెచ్చమనే అనే తోటలో గెత్సేమని అను తోటలో అరెస్టు చేశారు తప్పుడు దేవదూషణ చేశాడు అన్న ఆరోపణతో, సిలువకు సిద్ధం చేశారు యూదా ప్రజలు.  పిలాతు వంటి వారు  తీర్పు తీర్చారు.  తలపై ముళ్ళ కిరీటం, శరీరం గాయాలతో, రోమా సైనికులు,  ప్రజలేమో సిలువ వేయుము అని,  చేతులు మరియు కాళ్లల్లో బ్రేకులు కొట్టడంతో, శిలువపై వేలాడదీయడంతో ఈ సిలువ సన్నివేశాన్ని మనం చూస్తాం. శ్వాస పీల్చుకోవడం ప్రభువుకు చాలా ఇబ్బందిగా కష్టముగా ఉంది,  చమట రక్తముగా కారుతుంది,  మధ్యాహ్నం మండుటెండ, ఒకవైపు దాహం కూడా అవుతుంది . ఆ సమయంలో పలికిన మాట ఈ మొదటి మాట.

jesus 1st word telugu

ఈ మాటలో నేర్చుకోవలసిన 3 విషయాలు:

  1. తండ్రిని తండ్రి అని సంభోదించట
  2. క్షమాపణ యొక్క ప్రాముఖ్యతను తెలుపుట
  3. ‘వీరికి తెలియదు’ అని చెప్పుట 
  1. తండ్రిని తండ్రి అని సంభోదించట

ఏసు క్రీస్తు ప్రభువు పరలోకమందున్న దేవుడిని ‘తండ్రి’ అని సంపాదించుట ద్వారా బాధలో ఉన్నప్పటికీ కూడా సంబంధం తెగిపోకూడదు అనే పాఠం ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు.  అనగా పరిస్థితులు ఎలా ఉన్నా దేవునితో సంబంధం నిలకడగా ఉండాలి. చాలా వరకు మన జీవితంలో కొన్ని అనివార్య పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు సహజంగా విశ్వాసం కోల్పోతాం. దేవా! నువ్వు ఉన్నావా? ఉంటే ఏం చేస్తున్నావ్? ఎందుకు ఈ సమస్యలో అనే మాటలు అంటూ ఉంటాం…  మరికొన్ని సందర్భాలలో దేవుని పూర్తిగా వదిలేసి లోకం వైపు మక్కువ చూపించి, లోక ఆశలతో తిరిగి దేవుని వద్దు అని దేవునితో సంబంధాన్ని కోల్పోతాం.  కానీ ఏసుప్రభు మాత్రం విడువక సంబంధాన్ని కొనసాగించాడు. మరి నీ సంబంధం ప్రభు తో ఎలా ఉంది?

JOSHUA BOOK TELUGU
యెహోషువ గ్రంథము – ప్రారంభము: Edward Williams Books PDF
  1.  క్షమాపణ యొక్క ప్రాముఖ్యతను తెలుపుట

ఆ ప్రభువుకు ఒకవైపు హాని తలపెడుతున్న… ప్రభువు మాత్రము వారిని క్షమించమని కోరాడు. పరలోక రాజ్యము లేదా దేవుని రాజ్యములో క్షమాపణ అనేది తారస్థాయి  సూత్రము. అందుకే ప్రభువు క్షమించాడు.  కొండమీద ప్రసంగంలో కూడా ప్రభువు క్షమాపణ గురించి చాలా విషయాలు చెప్పాడు. పేతురుతో కూడా 70 ఏళ్ల వరకు క్షమించాలి అన్న పాఠం పేతురుకు చెప్పాడు.

  1. ‘వీరికి తెలియదు’ అని చెప్పుట

పాపం మనిషిని గ్రుడ్డివాడిగా చేసింది.  మానవుడికి తన ముందే సత్యమున్న కళ్ళు కనిపించడం లేదు. దీనినే ఆధ్యాత్మిక గ్రుడ్డితనము అని అంటారు.  ఆనాడు యూదా ప్రజల ముందు, సైనికుల ముందు, శాస్త్రులు పరిశయ్యులు వంటి వారి ముందు, రాజుల ముందు ప్రభువు…ను గుర్తించలేని అంధత్వం వారిని కమ్మింది.  అందుకే ప్రభువును సిలువ వేశారు.  ప్రభువు వారిని దోషులుగా మాత్రమే కాదు గాని అజ్ఞానులుగా చూశాడు. అందుకే క్షమించమని తండ్రిని వేడాడు.

సువార్త సారాంశం: ఈ మొదటి మాటలో సువార్త సారాంశాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. దేవుడు మనలను క్షమించాడని, రక్షణ కలిగించడానికి ఈ భూలోకానికి వచ్చాడని, మన పాప శిక్షను శిలువ మీద మోసుకున్నాడని. 

యేసు పలికిన మొదటి మాట – వివరణ

ప్రభువైన యేసు జీవితంలో మొత్తము క్షమాపణ అనే బోధను తరచుగా చూస్తాం. మీ శత్రువులను ప్రేమించండి,  ఎవరితోనైనా శత్రుత్వం ఉంటే నీ బలిని ప్రక్కన పెట్టి వెళ్లి సంధి చేసుకోమని…  పలు బోధలు ప్రభువు చెప్పినట్లు చూడగలము బైబిల్ లో.  ఇది ప్రభువు మాటలతో చెప్పి సరిపెట్టుకోలేదు తన క్రియల యందు దీనిని సిలువపై చూపించాడు.  ఇది ఎంతోమందికి మాదిరిగా కూడా అయింది.  ఉదాహరణకు:  స్టెఫెన్ చనిపోయేటప్పుడు,  రాళ్లతో కట్టబడుతున్నప్పుడు…  ప్రభువా! వీరిని క్షమించు అని వారి మీద పాపపు మోపవద్దు అని ప్రార్థించాడు అపోస్తలుల కార్యములు  అను పుస్తకంలో.  అంటే ప్రభువు యొక్క మాదిరిని ఈ స్తెఫను పాటించాడు. 

 క్షమించడం నిజముగానే సులభం కాదు.  మన జీవితములో చేదు అనుభవాలను మిగిల్చిన వారిని ఏ విధంగా క్షమించగలం?  ఇది సహజమైన గుణమే.  కానీ క్షమించడమో దివ్యమైన గుణము.  అలా చేసినప్పుడే మనము దేవుని పిల్లలు అవ్వగలము.   మన జీవితంలో కూడా మనలకు నష్టం చేసిన వారు, హాని చేసిన వారు అవమానించినవారు ఉండవచ్చు.  మన విశ్వాసాన్ని కూడా బహుశా కొంతమంది ఎగతాళి చేసి ఉండవచ్చు. కానీ మొదటి మాటే మనకు మాదిరి అవ్వాలి.  క్షమించేవాడు నిజమైన ప్రేమ చూపించేవాడు మనసులో కపటము పెట్టుకున్న వాడే శత్రుత్వం పెట్టుకున్న వాడు ఈ సూత్రం గమనించండి.

haggai book telugu commentary pdf
హగ్గయి గ్రంథము వివరణ మరియు చరిత్ర – Edward Williams kuntam

ఏసుప్రభు క్షమించిన బైబిల్ లోని కొన్ని సందర్భాలు:

  1. వ్యభిచారం నందు పట్టబడిన స్త్రీని క్షమించుట. ( యోహాను 8:11)
  2.  పేతురుకు క్షమాపణ గురించి బోధించుట. ( మత్తయి18:22)
  3. పక్షవాయువు కలిగిన రోగిని క్షమించుట. ( మార్కు 2:5)
  4.  పాపాత్మురాలైన స్త్రీని క్షమించుట. (లూకా 7:48)

క్షమించుటవలన కలిగే లాభములు:

  1. హృదయ శాంతి –   క్షమించుటవలన హృదయ శాంతి మనసులో కలుగుతుంది.  ఉన్న కోపము బాధ తొలగి మంచి మనసు మనలో తిరిగి జన్మిస్తుంది. అది క్రీస్తు స్వభావము
  2. దేవుని కృప –  ‘ఇతరులను మనకు క్షమించినప్పుడు దేవుడు కూడా మన పాపములను క్షమిస్తాడు’ (మత్తయి 6:14). ఇందులో దేవుని కృపను మనం చూడవచ్చు. 
  3. ఆరోగ్యకరమైన మనసు –  క్షమించుట లేకపోవడం  వలన…  ఆ గాయం వెంటాడుతూనే ఉంటుంది.  ఒత్తిడి, భారమును క్షమించుట ఉన్నది తగ్గిస్తుంది. చక్కటి నిద్రనిస్తుంది. ఆరోగ్యమైన జీవితాన్ని జీవించగలవు క్షమించుట ద్వారా.
  4. సంబంధాలను కలుపుతుంది –  శత్రువులను క్షమించడం ద్వారా… తప్పు ఎదుటి వ్యక్తిదైనా సరే ఉన్న మనస్పర్ధం పోయి…  తిరిగి సంబంధాన్ని కలుపుతుంది. 
  5.  క్రీస్తు స్వరూప స్వభావం –  క్షమించడం వలన యేసు క్రీస్తు యొక్క ప్రేమను ఆయన యొక్క స్వభావమును నలుగురికి మనం చూపించి ఆయనను మహిమ పరచగలము.

ఆత్మీయ పాఠము మరియు ముగింపు

 ఒకప్పుడు మనము కూడా పాపము చేసి, దేవుని ఎరుగక, విచ్చలవిడి జీవితం జీవించి, అజ్ఞానంలో, దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారమే.  బైబిల్ నియమం ప్రకారం ఇట్టి పాపులకైనా మనకు శిక్ష పడాలి.  అది భయంకరమైన శిక్షనే.  నరకంలో యుగయుగాలు కాలిపోవాలి.  కానీ ప్రభువు చేసిన త్యాగము మనలకు క్షమాపణను ఇచ్చింది.  మరి క్షమాపణ పొందిన నీవు నేను వేరే వ్యక్తులను క్షమించలేమా? 

 బహుశా మన జీవితంలో క్షమించలేని కొంతమంది వ్యక్తులు ఉంటారు నిజమే కానీ ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మనం రావాలంటే వారిని క్షమించాలి.  అప్పుడే మనము సిలువ ప్రేమను ప్రపంచమునకు చూపించినట్లు.  ఒక చక్కటి నిర్ణయంతో దేవుని దగ్గరికి వచ్చి – “ప్రభువా! నీవు నన్ను క్షమించావు అందును బట్టి కృతజ్ఞతలు.  అయితే నేను క్షమించలేని వ్యక్తులను క్షమించే మనస్సును నాకు దయచేయి అని దేవుని అడుగుదామా!” 

Leave a Comment