యేసు క్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలు – Jesus Christ 7 words on the cross

యేసు క్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటల నేపథ్యము బైబిల్లోని నాలుగు సువార్తలో మనకు కనపడుతుంది. లూకా 23:33 “కల్వరిగిరిమీద ఇద్దరు దొంగల మధ్య ‘సిలువ’ పై యేసుప్రభువు యొక్క సిలువ మరణము ప్రవక్తల యొక్క ప్రవచనానుసారం మాత్రమే జరిగినది.”

యేసు క్రీస్తు సిలువ ప్రవచనాలు:

1. యెషయా 50:6లో “కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మి వేయువారికిని, అవమానపరచువారికిని నా ముఖాన్ని దాచుకోలేదు” 
2. కీర్తనలు 41 : 9లో “నేను నమ్ముకొనిన నావిహితుడు, (యిష్టమైనవాడు) నా యింట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమను యెత్తెను" మరియు కీర్త 118:13లో, "నేను పడునట్లుగా గట్టిగా త్రోసెను” మరియు 69 : 20, “నిందకు నా హృదయం బహుగా బ్రద్దలాయెను” గనుక నేను బహుగా కృషించియున్నాను. అయితే కరుణించు వారి కొరకు ఆశతో కనిపెట్టితిని, కాని ఎవరునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని, గాని ఎవరునూ కానరారైరి. చేదును నాకు ఆహారంగా పెట్టిరి. దప్పికైనపుడు నాకు ‘చిరకను’ త్రాగనిచ్చిరి” అని దావీదు భక్తుడు ప్రవచించిరి. ప్రభుని యీ లోకంలో యెంతో మంది వెంబడించారు. వేలకొలది మందికి ఆయన సమృద్ధిగా ఆహారం పెట్టియున్నాడు. అనేకుల్ని భయంకర వ్యాధుల నుండి స్వస్థ పరచినాడు.

చివరిరాత్రి భోజన సమయంలో, 120 మంది, ఆయనతో పాలుపంచుకున్నారు. కాని చిత్రవధ జరుగుచున్న సమయంలో ఆదరించుటకు, ఒక్కరూ ఆయనకు ఎంతవెదకినా కానరాని కడుదీన స్థితి అది. అంతకుముందు ప్రభువు, ప్రజలు బహుగా ఆశ్చర్యపడే ఎన్నో గొప్ప ఆత్మీయ ప్రసంగాలు చేసియున్నాడు. అయితే చివరిగా ‘సిలువ’ మీద వుండి, పలికిన ఏడు మాటలు చాలా గంభీరమైనవి మాత్రమేగాక, లోకానికి యెంతో ఆదరణకరమైన. గనుక వాటిని ఆత్మీయంగా ధ్యానించాలి.

సిలువలో మొదటి మాట: తండ్రీ వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు

లూకా 23:18లో ఆ ప్రజలు యేసుని “సిలువ” వేసి ‘బరబ్బా’ను తమ కొరకు విడుదల చేయమని కోరిన ప్రజలు మరియు లూకా 23 : 2లో “ఇతడు మమ్ములను తిరుగుబాటుకు ప్రేరేపించాడు, మరియు కైసరుకి పన్ను యివ్వవద్దని మమ్ముని ప్రేరేపించాడు. మరియు తానే ఒక రాజునని చెప్పగా వింటిమి” అని అబద్దపు సాక్ష్యం పలికిన ప్రజలు. ప్రసంగి 7:29లో అందర్ని యాదార్ధవంతులుగా అనగా సత్యాన్ని అనుసరించే వారిగా చేసినాకూడా యీ యుగ సంబంధమైన దేవత వారి కనులకు అంధత్వాన్ని కలిగించిచ, ఈ విధంగా కేకలు వేపిస్తుంది. పూర్వం సత్యాన్ని చూడ కుండా మూయబడిన ‘గెహాజీ’ కనులు తెరువబడునట్లుగా భక్తుడు ‘ఎలీషా’ ప్రార్ధించినట్లుగా, యేసయ్య కూడా అనాటి ప్రజలు సత్యాన్ని గ్రహించుట ద్వారా నిత్య రాజ్యానికి వారసులు కాగలుగుటకుగాను, వారిని క్షేమంచమని తండ్రిని పార్ధించుట. మత్త 5:44 లో “మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై వుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మరియు మిమ్మును హింసించు వారికొరకు ప్రార్ధన చేయుడి” అని ఆయినే బోధించాడు. అయితే పరిశయ్యులవలె బోధించుట మట్టుకు బోదిస్తారుగాని ఏమాత్రంకూడా దాన్ని నెరవేర్చరు అనినట్లుగా కాకుండా ప్రభువు పూర్తిగా ఆచరిస్తున్నాడు. పేతురు జనులకు యేసయ్యను గూర్చి బోధిస్తూ చెప్పినది : అ.కా. 3 : 17 “మీ మీ అధికారులును తెలియక జేసితిరని నాకు తెలియును. తెలియక అనేది యేసయ్య ఏమైయున్నాడో అనే విషయాన్ని వారేమాత్రం కూడా గ్రహించలేకపోయారనుట. అలాగే అ.కా 13 : 27 యెరూషలేము నివాసులు, వారి అధికారులును, క్రీస్తుని గూర్చి ఆయినను విశ్రాంతి దినంలో చదువ బడుచున్న ప్రవక్తల యొక్క ప్రవచనములకైనను, గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట కూడా వారికి తగిన గ్రహింపు లేనందునే. అలాగే అ.కా 26 9 అధికార గర్వంతో యేసు నామానికి విరుద్దంగా అనేక కార్యములు చేయాలని పౌలు తలంచియున్నాడు. తెలిసిన తదుపరి అతను చెప్పేది: 1కొరి 2:8 లో చుస్తే ప్రభుని గూర్చి లోకాధికారులకు ఎవ్వరికి, పూర్తిగా తెలియదు, అందుకు కారణం వారి జ్ఞానం పూర్తిగా నిరర్ధకమైనది. గనుక, ఆయన్ని గూర్చి ఎరుగరైరీ. చివరిగా ఆయన చెప్పేది 1తిమో 1:12-13 తెలియక జేసితిని గనుక కనికరించబడితిని. అని అలాగే యోహా 16 : 3లో ప్రభువుచెప్పేది: వారు తండ్రిని నన్ను గూర్చి తెలిసి కొనలేదు. గనుక ఈలాగుచేయుదురు. అయితే యీనాటికి కూడా, కుమారుని గూర్చి నపుంసకుని వలె పూర్తి అవగాహన కలిగిన వారమై, క్రీస్తు ప్రభుని మన సంరక్షకునిగా అంగీకరించవలసిన వారమైతున్నం! ఇపుడు తిరిగి యేసయ్య, మనలను గూర్చి తెలియక చేశారు గనుక క్షమించు తండ్రీ! అని యేసయ్య ప్రార్ధించనే ప్రార్ధించరు. ఎందుకంటే యేసయ్య ‘ఎవ్వరో’ అని దాన్ని గూర్చి గత రెండు వేలు సంవత్సరాలుగా ఎడతెగకుండా సర్వ లోకంలో సర్వ ప్రజలకు ప్రకటించబడుచున్నది గనుక. ఇప్పటికే ప్రభువు సువార్త వినిన నీవు ఆయనను స్వంత రక్షకునిగా ఆయనను స్వీకరించు ఇతరులను క్షమించు. ఎందుకు అనగా క్రీస్తు నీ పాపములను క్షమించాడు కాబట్టి!

సిలువలో రెండవ మాట: నేడు నీవు నాతోకూడా పరదైసులో వుందువు

ఈ మాట యేసు ఎవరితో అంటున్నది? లూకా 23 :42 ప్రకారం ఒక భయంకరమైన బందిపోటుతో, ఎందుకంటే లూకా 23:32 లో ఆయనతోకూడా చంపబడుటకు, యిద్దరు నేరస్తులు ఆ చోటుకి తేబడిరి. ఆ కుడిప్రక్కదొంగ రక్షణకు కారణము అతని పాపపు ఒప్పుదలే. ఈ దొంగలో పాపపు ఒప్పుదల నాలుగు విధాలు చూస్తాము:

1. తన ప్రక్కవాడితో, మనం చేసిన ఘోరతప్పిదాలకు, ఈశిక్ష మనకు తగినదే, న్యాయమే అని ఒప్పుకున్నాడు.
2. ఈయన క్రీస్తు అయివుండగా ఈయనలో దోషంలేదని నీకు తెలియదా ?
3.ఈ చివరి ఘడియలోనైనా, నీవు నీ పాపపు స్థితినిబట్టి దేవునికి భయపడవా? యిర్మియా 8:14 ప్రకారం “మనం దేవునికి విరుద్దంగా పాపం చేసినందున మన దేవుడు మనకు విష జలాన్ని త్రాగించుచునన్నాడు.
4. యేసయ్య ఏమైవున్నాడో గ్రహిస్తున్నాడు.

A. దేవుని కుమారుడనియు, పరలోకాధిపతి అని నమ్మాడు. అంటే దీనర్థం, దేవుడు తన కుమారున్ని, మరణంనుండి లేపి, పరలోకంలో తండ్రి తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టి పరలోక సర్వాధిపత్యము ఆయనకే యిస్తాడని భావన. పశ్చాత్తాప హృదయంతో, మారుమనస్సు కలిగి, పరలోక రాజ్యాన్ని చూస్తున్నాడు. నలిగిన హృదయంతో దానికొరకు వినయంతో ప్రార్థించుట. అయితే మనలో కొంతమందివలె తెలియని ఆవేశంతో యెగిరి గంతులు వేయలేదు. అయితే గ్రహింపు కలిగి తనను తాను పరిశుద్ధుని హస్తాలకు అప్పగించుకొంటున్నాడు. అందుకు ప్రభువు పలికిన ‘రెండవమాటే’ కుడిప్రక్క దొంగపొందిన జవాబు. ఇతను ప్రభుని సముఖానికి రాకముందు, మొదటి దొంగ అనుభవాన్నే కలిగియున్నాడు. అయితే ప్రభుని ముఖకాంతి అతన్ని పూర్తిగా మార్చివేసింది. అందువలన అతని మొండి హృదయం మార్చబడింది. చీకటిని వదలి వెలుగును ధరించింది. అయితే మన స్థితి ఏమిటి ? ఆది 2 : 8 ప్రకారం ఏదేనులో దేవుడు వేసిన తోటే పరదైసుగా తలంచాలి. అందుకే లూకా 23 : 51 లో ‘అరీ మత్తయి’ సజ్జనుడును, నీతిమంతుడునై, దేవుని రాజ్యం (పరదైసు) కొరకు కనిపెట్టు యుండుట. అలాగే లూకా 2:25లో, సిమెయోను కూడా, నీతిమంతుడును, భక్తిపరుడునై యుండి, దేవుని రాజ్యంకొరకు కనిపెట్టినవాడు. అలాగే లూకా 2:38 ‘అన్న’ అను ప్రవక్తిరి దేవాలయం విడువక ఉపవాస ప్రార్ధనతో, రేయింవళ్ళు సేవ చేయుచు దేవుని రాజ్యంకొరకు కనిపెట్టుట. అట్టి గొప్ప పరిశుద్దులు, పరిశుద్దమైన ఆ గొప్పరాజ్యం కొరకు సంవత్సరములు కొద్దీ ఎంతో భక్తి శ్రద్దలతో కనిపెట్టి యుండుట అనేది మనకు కనువిప్పుకావాలి. అదియు గాక మనకు మత్తయి 13:41 చెప్పబడింది.

jesus 1st word telugu
Jesus 1st word on the cross in telugu: తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు
“మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యంలో నుండి సకలమైన ఆటంకములను దుర్నీతి చేయువారిని నమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు.”

అని అయితే మార్కు 12:25 లో గల వాగ్ధానం: నా కుడి ప్రక్కన గల దొంగవలె పశ్చాత్తాపంతో క్షమాపణ నొందిన వారే దేవుని పరలోకపు రాజ్యంలోనికి ప్రవేశించగలరు. అయితే వ్యక్తి పాపం పరిపూర్ణంగా కడగ బడవలసి యున్నది. అందుకు తగిన రీతిగా సిద్ధపడవలసి యున్నది.

jesus 7 words, jesus 7 words on cross telugu, jesus christ 7 words

సిలువలో మూడవ మాట: అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి

ఈ మాటను యోహాను 19:26, 27 లో చూడగలము. ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పినమాట ఎంతో ప్రాముఖ్యంగలది. ఎందుకంటే ప్రభవు బాలుడుగా వున్నపుడు సిమియోను భక్తుడు ఎత్తుకొని పలికిన మాట. “మరియ హృదయంలో నుండి ఖడ్గం దూసుకొని పోవును” అని. ఈ మాటనుబట్టి లోకరీత్యా తల్లిగా ఆమె పొందే వేదననుండి ఆమె విడుదల పొందుటకే ఈ మాటను చెప్పుట జరిగింది. మరియు తాను ప్రేమించిన శిష్యునితో ‘ఇదిగో నీ తల్లి‘ అని చెప్పుట. అయితే వచనం 27 ప్రకారం ఆ ఘడియనుండి, ఆశిష్యుడు ఆమెను తన యింటిలో చేర్చుకొనెను. ఈ అనుబంధం మరియ హృదయంలోనుండి దూసుకుపోయిన ఖడ్గముయొక్క గాయాన్ని, శాశ్వతంగా మాన్పివేసింది. తాను ప్రేమించిన శిష్యుడికి, తన స్థానాన్ని యిచ్చి అతని ప్రేమను తన తల్లికి తన తరపున చూపి ఆదరించవలసిందిగా కోరుట. ఇది మూడవ ఆజ్ఞను త్రికరణశుద్దిగా నేరవేర్చుటగా అని తలంచాలి. ఎందుకంటే నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించాలి. గనుక అట్టి భయంకర క్లిష్టపరిస్థితుల్లో కూడా వారిరువురిలో ఉన్న గొప్పకొరతలు తీర్చి వారిని పూర్తిగా సమాధాన పర్చగలశక్తి మంతునిగా తన్నుతాను ఋజువు పర్చుకొనుట మనకెంతో కనువిప్పై యుండాలి. ఆయనతో మనకు అట్టి అనుబంధం కావాలి. మరియమ్మ యేసయ్యను తన కుమార్తుగా భావిస్తుంది. అయితే లూకా 1:32 దేవదూత చెప్పింది: ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. లూకా 1:35 పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. అయితే ఆదూతే మరియతో చెప్పినది: లూక 1:30 దేవుని వలన నీవు కృప పొందితివి. లూకా 1:35 పరిశుద్దాత్మ నీ మీదకి వచ్చును, దేవుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక దేవుని కుమారుని జన్మనిచ్చెదవు అని గనుక అది మాత్రమే మరియ చేవలసిన కార్యమైవుంది, ఆ ప్రకారం ఆమె నెరవేర్చియున్నది. అయితే యోహా 2:4 నీతో నాకేమి పని? అని ఆమెతో చెప్పుటలో ఆయనకు గల అభిప్రాయం ఆయన లోకానికి పంపబడిన తండ్రి వుద్ధేశంలో ఆవగింజంత పనికూడా మొదలు కాలేదు. ఇక్కడ ప్రభునిలో రెండు నైజములు కనిపిసున్నాయి. (1) అమ్మా యిదిగో నీ కుమారుడు అనేది మానవ సంబంధమైనదికాగా, (2) నీతో నాకేమి పని అనేది దైవికమైనది. నేను నా తండ్రి కార్యాన్నే జరిగించవలసిన వాడనై యున్నాను గాని, నీతో నాకేమి పని అని, మోమాటంలేకుండా ప్రభువు మాటలాడుట చూడగలం.

ఇతర పోస్టులను చదవండి – CLICK HERE

సిలువలో నాల్గవ మాట: నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి

ఈ నాలుగవ మాటను మత్త 27:46 లో చూడగలము. అయితే మనం యోహాను 8 :9 లో గల ఆయన మాటను జ్ఞాపకం చేసుకోవాలి. “నన్ను పంపిన నా తండ్రి నాకు తోడై వున్నాడు” ఎందుకంటే ఆయన కిష్టమైన కార్యం నేనెల్లపుడు చేయుదును. గనుక ఆయన నన్ను ఒంటరిగా విచిడి పెట్టలేదు, అనుటే గాక, యోహాను 10:30 లో “నేనును నా తండ్రియు ఏకమైయున్నాము” అనుట. మరియు యోహాను 16:32 లో “ఇదిగో మీరు నన్ను ఒంటరిగా విడిచిపెట్టి చెదిరిపోయే గడియ వచేయున్నది. అయినా తండ్రి నాతో వున్నాడు, గనుక నేను ఒంటరిగా లేను” మరియు యోహాను 17:11లో “పరిశుద్ధుడవైన తండ్రీ మనం ఏకమైవున్నలాగున” అని పలికిన ప్రభువే, యిపుడు తండ్రీ నన్నెందుకు చేయివిడిచావు, అని వేదనపడుచున్నాడు. యేసు చెయ్యిని తండ్రి విడుచుటకు కారణాలు: గలతి 3:13 లో పౌలు చెప్పినట్లుగా : “పాపం ఎరుగని క్రీస్తు మనకొరకు ‘శాపగ్రాహి’ ఆయెను”. మరియు యెషయా 53:6 లో “మన అందరి దోషములు తండ్రి ఆయనమీద మోపెను” అనుట. అలాగే మత్తయి 8:17లో “క్రీస్తే మన దోషములను, తన మీద వేసుకొని భరించెను” అని చెప్పబడుట. అలాగే యోహాను 4:29 లో “లోకపాపములను మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల” అని యోహాను ఆత్మావేశంతో అనుట. ఆపాపాలే, యెష 59:2 ప్రకారం నరుడ్ని దేవుని నుండి వేరుపరచును. ఉదా : ఆదాము దేవుని వనం నుండి తోసివేయబడుట.

ఈ : గిన్నెలోనిది నేను త్రాగలేను అనుటలోగల వుద్దేశము ఆయన ఎన్నడూ ఎరుగనట్టి పాపాంధకారం మరియు పాపపు మునుగు ఆయన్ని క్రమ్ముకొనగా ఆయన దాన్ని భరించలేకపోయాడు. తన శిష్యులు, సమాజపు వారు అనగా మేడగదిలో భోజనం చేసినవారు మరియు తనను వెంబడించిన అనేక మంది, నన్ను విడచినా భరించగలనుగాని నాతండ్రి నీవు నన్ను ఒక్క క్షణం చేయి విడిచినా నేను భరించలేను, అని తన ఒంటరితనాన్ని బట్టి ఎంతగానో వేదన పడుచున్నాడు. అయితే యిక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసిన గొప్ప విషయం. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికిగాను మనం ఎన్నోసార్లు ఆయనకు దూరమగుచున్నాము.- అందకే భక్తుడు చెప్పింది : “ఈలోక స్నేహం దేవునితో విరోధం” అని ఆవిధంగా మనం మన యిష్టాన్ని నెరవేర్చుకొనుట కొరకు ఆ ప్రభుని విడిచిన ఎడబాటుకి ప్రభునివలె మనం ఎన్నడు కూడా, భారంతో ఈ అనుభవాన్ని కలిగియుండలేదు. అయితే పౌలు కూడా చెప్పింది. “అయ్యో నన్నెవరు ఈపాపపు దుస్థితినుండి, విడిపించి రక్షిస్తారు?” అని ఇట్టి అనుభం మనకు వున్నచో, యెష 25:7,8 ప్రకారము “సమస్త జనముల ముఖములను కప్పుచున్న ‘ముసుగును’ సమస్త జనములమీద పరచబడిన ‘తెరను’ ఈ పర్వతంమీద ఆయన తీసివేయును, మరెన్నడును వుండకుండా మరణమును, ఆయన మ్రింగివేయును. మరియు ప్రతివాని ముఖంమీద నున్న బాష్ప బింధువును ఆయన తుడిచివేయును మరియు తన జనములయొక్క నిందను తీసివేయును. ఇందుకు కీర్త 22:1లో నీవు నన్నెందుకు విడనాడితివి? నా ఆర్తధ్వని వినక, నన్నురక్షింపక నీ వేలదూరంగా వున్నావు? మరియు యెష 59 : 11 కష్ట పరిస్థితిలో, రక్షణయు, సహాయం దూంమామెను. కీర్త 38:8 మనోవేదాన్ని బట్టి కేకలు వేసి సొమ్మసిల్లితిని, గాని కీర్త 10 : 1 నీవు దూరంగా వున్నావు దూరంగా దాగి యున్నావు. ఇక్కడ దూరం, అంటే కీర్త 13:1 ప్రకారం, మరచి విముఖుడై వుండుట అని తలంచాలి. అయితే కీర్త 33:22 నాదేవా స్థితి నీకే కనబడుచున్నదిగదా! గనుక నా పట్ల మౌనంగాను, యిపుడు నాకు దూరంగాను వుండకుము అని ప్రార్థించుటను చూడగలం మరియు హెబ్రీ 5:7 పౌలు యీ విషయాన్నిగూర్చియిచ్చే వివరణ “శరీరధారియైయున్నపుడు, మహారోధనంతోను, కన్నీళ్ళతోను తన్ను మరణంనుండి, రక్షింపగల వానికి ప్రార్ధనలను యాచనలను సమర్పించి భయ భక్తులు కలిగి యున్నందున అంగీకరింపబడెను”. నీవు, నేను అంగీకరించబడవలెనంటే మనకు యిట్టి గొప్ప అనుభవం, అవసరమని యీమాట మనకు బోధిస్తుంది.

ఐదవ మాట: నేను దప్పిగొనుచున్నాను

ఈ మాటను యోహాను 19:28 లో చూడగలము. ఇది చాలా ఆశ్చర్యకరమైన మాట, ఎందుకనగా యోహాను 4:14లో యాకోబు బావిదగ్గర, సమరయ స్త్రీతో “నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎన్నడును దప్పిగొనడు” అని స్పష్టంగా చెప్పిన ప్రభువే యిపుడు “దప్పిక గొనుచున్నాను” అనుట నిజంగా ఆశ్చర్యకరమే. ఇదియే గాక యెష 44:3లో, “దప్పికగల వారిమీద నీళ్ళను క్రుమ్మరిస్తాను” అని వాగ్ధానమిచ్చుటయే గాక, కీర్తన 78:15,16లో “అరణ్యంలో ఆయన బండనుచీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీటిని త్రాగనిచ్చెను. బండలో నుండి నదులను నీటి కాలువలను ప్రవహింపజేసెను” అని చెప్పబడింది. అలాగే ప్రకటన 22:17లో “దప్పిక గొనిన వానిని రానిమ్ము, ఇష్టపడిన వానిని జీవజలాన్ని ఉచితంగా పుచ్చుకొననిమ్ము” అని వాగ్ధాన మియ్యబడింది, ఆయన ద్వారానే. అందుకే దావీదు కీర్తనలు 36:9లో క్రీస్తులో జీవజలపు వూట గలదు. అని దావీదు, ఆయన యందు విశ్వాసముంచు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును. అని యోహాను 7:38లో చెప్పుట చూడగలము. అయితే అట్టి ప్రభువు “నేను దప్పిగొనుచున్నాను” అనుట, కేవలము పై ప్రవచనముల యొక్క నెరవేర్పుకొరకు మాత్రమే. అందుకే కీర్తన 69:21 “నాకు దప్పికకలుగగా ‘చిరకను’ త్రాగనిచ్చిరి” అని దావీదు భక్తుని ప్రవచనం నెరవేరవలసియున్నది. యోహా 4:6లో ప్రయాణాన్ని బట్టి ప్రభువు ‘సుకారను’ వూరి దగ్గరగల యాకోబు బావి దగ్గరకు చేరుసమయానికి, దాహంగలవాడై, కూర్చుని యుండగా, 4:7 ప్రకారం నీటి కొరకు సమరైయస్త్రీ ఆ బావి దగ్గరకు వచ్చినపుడు నాకు దాహంగా వుంది, నీరిమ్మని అడుగుట. అయితే యోహాను 7:37 ప్రభువే అంటున్నాడు దప్పికగలవారు నా యొద్దకు రావచ్చు అని. అలాగే యెషయా 55:1 దాహంగల వారు నా దగ్గర ఉచిత జలాన్ని పొందవచ్చునని వాగ్ధానం కూడా యిస్తున్నాడు. యిర్మియా 2:13 జీవ జలపు వూటనైనన్ను విడిచిపెట్టారనుట. అయితే యీ జీవజలం, యెరూషలేమునుండి పారుట ప్రారంభించు. అని జకర్యా 14:8లో చూడగలము. ఈజీవజలనది బ్రతుకును. 47:9 ఎచటకు పారునో అక్కడ సమస్తం

భయము - Fear, Bible telugu
భయము గురించి బైబిల్ బోధ – Bible Teaching on FEAR in Telugu

ఆరవ మాట: సమాప్తమైనది

యోహాను 19:30 లో సమాప్తమైనది అను ఈ మాట మనకు కనబడును. ఇంతకుముందు ఏ ఒక్కరు, ఎన్నడూ చెప్పలేని మాట. అయితే యేసయ్య తన సంపూర్ణ సమర్పణతోను, తండ్రికి నమ్మకముగాను, గొప్ప విధేయతతోను తనకప్పగించిన రక్షణ కార్యాన్ని పరిపూర్ణంగా ముగించి, తండ్రితో చెప్పిన మాటే ఇది. ఎంత చక్కగా చెప్పబడిందో గమనించాలి. యోహాను 17:4 “తండ్రీ ! భూమిమీద చేయుటకు నీవు నాకిచ్చిన కార్యమును సంపూర్ణంగా నెరవేర్చి, నిన్ను మహిమపరచితిని”, లూకా 21:5లో అందమైన దేవాలయము పడద్రోయబడును. అయితే ఎన్నడును పడత్రోయబడని దేవాలయం కన్నా గొప్ప రక్షణకార్యాన్ని లోకం కోసం ప్రభువు సమాప్తము చేశాడు. దేవునిపట్ల మోషేగాని, ఏలీయాగాని చేసిన కార్యాలు ఎంతో గొప్పవి, మరియు దేవునికి మహిమకరమైనవే. కాని అవి కొన్ని లోటులతో నిండియున్నవి. కాబట్టి వారు తమ పనిని సమాప్తమైనది అని అనలేక పోయిరి. అయితే యేసయ్య ముగించిన కార్యం పరిపూర్ణమైనది. అనేకుల కొరకు శాశ్వతముగా సరిపోయినది. అని మార్కు 10:45 లో చెప్పుట కలదు. సమాప్తమైనది అనుటలో ఇంక ఏ మాత్రం మిగిలియుండలేదని అర్దము. అయితే యోహా 17:4 నీవు నాకిచ్చిన, పనిని, పూర్తిగా నెరవేర్చి, భూమిమీద నిన్ను మహిమ పరచితిని. అని చెప్పిన ప్రభువు యోహా 6:34 ఆయన పనిని తుద ముట్టించుటే నాకు ఆహార మనుట ఎంతో గొప్ప విషయం యోహాను 5:36లో, నేను చేయుటకు తండ్రి నాకిచ్చిన క్రియలే యోహాను కలిగి యున్న సాక్ష్యం కంటే గొప్పవై యున్నవి. అనుట, మరియు యోహాను 9:4 లో పగలున్నంతవరకు తండ్రి పనులను జరిగించ వలసినది అంటే రాత్రి ఎవరూ ఏమీ చేయరు, అనునట్లుగానే యేసయ్య తన మరణం తరువాత భూలోక సంబంధంగా ఏమీచేయకూడని పరిస్థితిని గూర్చి చెప్పుట. అందుకే లూకా 2:49లో మరియమ్మ, యేసేపులతో నేను నా తండ్రి పనుల మీద వుండాలి గదా, అని వారిని గట్టిగా హెచ్చరించుటలో గల భావం నా కున్న యీ కొద్ది సమయంలో నా పరలోకపు తండ్రి పనులను వదలి వ్యర్ధమైన ఈలోకపు కార్యాల వైపు నా మనస్సుని మళ్ళించలేను. అని తలంచుటను బట్టి, నిర్ణేత సమయాలలో పూర్తిచేసి సమాప్తమైనదని చెప్పకలుగుట.

ఏడవ మాట : తండ్రీ! నీచేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను

ఈ మాటను లూకా 23:46 నందు చూడగలము. బాల్యమందే తల్లి తన బిడ్డలకు యూదా మత సాంప్రదాయకముగా నేర్పించే ప్రార్ధన. రాత్రి పడుకొనే సమయంలో తప్పక ఈ ప్రార్ధన చేస్తారు. అయితే యేసయ్య సిలువ మీద పలికే ఈ మాట వాడుక చొప్పున పలికేది మాత్రం కాదు, కాని వాక్యానుసారం అనగా మార్కు 12:25 ప్రకారం “పరదైసులో ఉండువారు దేవదూతలు, పరిశుద్ధులు, నీతిమంతులు మరియు పశ్చాత్తాపంవలన క్షమాపణ నొందినవారు”ట అని గలదు. అయితే సాతాను ప్రభుని యొక్క బాప్తీస్మపు కాలం నుండి, ఎంతో తీవ్రంగా శోధించాడు. మరియు ఆయనపైన మురికి చల్లాలని ఎన్నోరీతులుగా ప్రయత్నించాడు. అందుకే ప్రభువు తనలో పాపము ఉంటే. అది ఋజువు చేయమని సవాలు చేశాడు. పిలాతు తన తీర్పులో, “ఈ మనుష్యుని యందు నాకు దోషము కనబడుటలేదని” తీర్పు ఇచ్చాడు. ప్రభువు ఆత్మశక్తితో సాతాన్ని వెనుకకు నెట్టి తాను 40 దినాలు ఉపవాస ప్రార్ధనతో శక్తి, బలం పొంది తనకు అప్పగించిన ఆ రక్షణ కార్యాన్ని తన పవిత్ర జీవితంతో ముగించాక, తిరిగి ఆ ఆత్మను పరిశుధ్ధంగానే తండ్రి పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తునాడు ఎందుకు? 1 సమూయేలు 25:29 ప్రకారం ” నీ ప్రాణం నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపుమూటలో దాచబడుటకు” అంటే ఇది యుగ యుగాలు ఉండాలి గనుక, లాజరువలె మన ఆత్మను, దేవునికి అప్పగించుకుంటే అబ్రహారము రొమ్మున ఆనుకొనే విశ్రాంతి మనకు దొరుకుతుంది. ధనవంతునికి దొరకని ఆ గొప్ప భాగ్యం మనకెలా దొరుకును? కొలస్సీ 2:14 ‘లోకంవలనను, పావంవలనను మనకు ఎట్టి భయంలేకుండా చేయుటకే యేసయ్య మరణించాడు, గనుక అది మనకు సాధ్యము. అదెట్లనగా: ఇర్మియా 38:16 ప్రకారం దేవుడు క్రీస్తు ద్వారా తన జీవాత్మను శాశ్వతంగా మనకు అనుగ్రహించాడు. అని మనం నమ్మవలసియున్నది. కీర్త 31:50 నా ఆత్మను నీకు అప్పగిస్తున్నా అనే దావీదు ప్రవచనం ప్రకారమే యిలా జరుగుట, మరియు కీర్త 10: 14l “నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు” అలాగే 1 పేతు 4:19 “దేవుని చిత్త ప్రకారం బాధ పడువారు, సతప్రవక్తన గల వారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. అందుకే స్తెఫను అ.కా 7:59 ప్రకారం తన ఆత్మను దేవునికి అప్పగించు కొనుట జరిగింది. అలాగే పౌలు బోధ 2తిమో1:12 నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుదినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. కీర్త 10:14 నిరాదారులు తమ్మును నీకు అప్పగించు కొందురు. అనునట్లుగా కీర్త 69:20 కరుణించు వారి కొరకు కనిపెట్టికొంటిని గాని ఎవరును లేక పోయిరి. ఒదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని కాని ఎవరూ కానరాక పోయిరి.”

Leave a Comment