నోవహు అను మాటకు “నెమ్మది”, “విశ్రాంతి” లేక “ఆదరణ” అని అర్ధము. యెహోవా భూమిని శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను, మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని, అతని తండ్రి అతనికి నోవహు అని పేరు పెట్టెను” (ఆది 5:29). కావున “నోవహు” అను నామము సార్థకము కాలేదు. శాంతి సమాధాన మార్గమును నోవహు బోధించినను ఆనాటి ప్రజలు ఆ బోధను తృణీకరించి పాపమును ప్రేమించినందువలన నోవహు వారికి నెమ్మదిని కలుగజేయలేకపోయెను. తనను, తన కుటుంబమును మాత్రము రక్షించుకొనగలిగెను. తక్కిన తన తరమువారందరు నశించిరి. తల్లిదండ్రుల మీద ఆధారపడు బిడ్డలును, బిడ్డల మీద ఆధారపడు తల్లిదండ్రులుసు అట్లే నిరాశ చెందుదురు. నోవహు దేవుని యొక్క ఉన్నతాభిప్రాయమును నెరవేర్చెను. నాటి పాత ప్రపంచములో నోవహు ఒక్కడే దేవుని పక్షమున సత్యసాక్షిగా నిలువబడెను. ఆ కాలపు వడియైన పాపపు యేటిలో కొట్టుకొని పోక ఆ ప్రవాహమునకు ఎదురీదెను నోవహు . అతడొక్కడే ప్రళయ జలములను దాటి నూతన ప్రపంచవు ఆవలి గట్టునకు చేరగలిగెను. ఇట్టి ధన్యజీవి యొక్క చరితమును ధ్యానించుట మన భాగ్యము.
నోవహు యొక్క వంశము
నోవహు భక్తిహీన ప్రపంచములో భక్తిగల వంశమునకును, కుటుంబమునకును చెందినవాడు. అతని పితామహుడైన హనోకు మూడు శతాబ్దములు దేవునితో నడిచి, దేవునిచేత వరమునకు కొనిపోబడెను. అతని పితామహుడైన మెతూషెల కూడ తన తండ్రివలె భక్తిపరుడని ఉహిమ్పవచ్చును. ఎలాగనగా, అతడు తన తండ్రి దేవునితో నడుచుట 800 సంవత్సరములు చూచెను. ఆయన భక్తిహీనుల మీదికి రానైయున్న తీర్పును గూర్చి భోధించుట వినెను. తుదకాయనను దేవుడు తీసికొనిపోవుటను ఎరిగెను. మెతూషెల 187 ఏండ్లవాడై తన ప్రథమ పుత్రుడైన లెమెకును కనెను. లెమెకు చనిపోయిన తరువాత మరి యైదు సంవత్సరములు బ్రతికెను. తన మనుమడైన నోవహు పుట్టుట, పెరుగుట, వివాహమాడుట దాదాపు 600 సంవత్సరములు చూచెను. మనుమని అంత్య సందేశమును దాదాపు 120 సంవత్స రములు వినెను. అతడు కట్టుచున్న వింత ఓడను కన్నులార చూచెను. అది చూచి తన మరణము ఆసన్నమగుచున్నదని గ్రహించి దానికొరకు సిద్ధపడెను. ఈ అనుభవములన్నియు అతని జీవితమును మార్చెను.
నోవహు తండ్రి కూడ దైవ భక్తిగలవాడని తలంపవచ్చును. లెమెకు తన ప్రథమ పుత్రుడైన నోవహును కనకముందు 182 సంవత్సరములు బ్రహ్మచర్య జీవితమును గడిపెను. లెమెకు బ్రతికిన సంవత్సరములన్నియు 777. బైబిలు సంఖ్యలు అర్ధసహితములు. (3, 5, 6, 7, 9, 10, 12, 40 మొద లైనవి). – అందు ఏడవ సంఖ్య మిగుల ప్రాముఖ్యమైనదిగా నెంచబడెను. ఏడవ దినము సబ్బాతు; ఏడు వారములు తరువాత పెంతెకోస్తు వండుగ; ఏడవ మాసమున ప్రాయశ్చిత్త దినము; ఏడవ సంవత్సరమున సబ్బాతు సంవత్సరము; ఏడు యేండ్లు 7 x 7 = 49 తరువాత 50 వ యేట సునాద వత్సరము; పదేండ్లు 10 × 7 బబులోను చెఱ, డెబ్బదిమంది శిష్యులు; డెబ్బది యేండ్లు (70 × 7=490) అను సంఖ్యను కయీను సంతతివాడైన లెమెకు తన దోష శిక్షా ఫలితమునకు ప్రయోగించెను (ఆది 4:24). కాని మన ప్రభువు ఈ సంఖ్యను కృపకు ప్రయోగించెను (మత్త 13:21, 22). ఏడవ సంఖ్య సంపూర్ణ సంఖ్యగను, దేవుని సంఖ్యగను పరిగణింపబడెను. ఆదికాండము 7, 8 అధ్యాయములలో అది 7 సార్లు ఉదహరింపబడింది. (ఆది 7:2,3,4,10; 8:4,10,12). లెమెకు యొక్క ఏడు వందల డెబ్బది యేడేండ్ల జీవితము దానియొక్క పరిపూర్ణతను సూచించుచున్నది. ఈ సంఖ్య ప్రకటన 13:18 లోని 666 కు వ్యతిరేకము. 666 మానవుని సంఖ్య. క్రీస్తు విరోధి (Anti Christ) యొక్క సంఖ్య. కాని 777 దేవుని సంఖ్య. మెతూషెల, లెమెకులు జలప్రళయమునకు ముందే చనిపోయిరి. “కీడును చూడకుండగనే దేవుడు వారిని తన యొద్దకు చేర్చుకొనెను, ఇట్టి కుటుంబమునకు చెందిన నోవహు జీవితము ఆదర్శప్రాయమై యుండుట విశేషము.
నోవహు యొక్క వ్యక్తిత్వం:
జలప్రళయమునకు ముందు అనగా హనోకు కాలమున ప్రారంభమైన భక్తిహీనతయు, దుర్మార్గతయు అంతకంతకు విస్తరించి నోవహు కాలమునకు పరిపక్వమాయెను. నరులు భూమిమీద విస్తరింప నారంభింపగా వారితో పాటు వారి పాపములుకూడ బహుగా విస్తరించెను. దేవుని ఆత్మ వారితో వాదించి, వాదించి, విసూగుచెంది (అది 6: 3) చివరకు వారు “తమ స్వకీయాలోచనలను బట్టి నడుచుకొనునట్లు వారి హృదయ కాఠిన్యమునకు వారిని అప్పగించెను” (కీర్త 81:12).
"నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృడ యముయొక్క తలంపులలోని యూహ యావత్తు ఎల్లప్పుడు కేవలము "చెడ్డ దనియు, యెహోవా చూచెను - ఆది 6:5
"భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి యుండెను, దూలోకము బలత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు, అది చెడిపోయి యుండెను; భూమిమీద నమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసికొనియుండిరి - ఆది 3:11,12
కావున దేవుడు నోవహును చూచి "నమన్త శరీరుల మూలముగ భూమి బలత్కార ముతో నిండియున్నది. గనుక నా సన్నిధిని వారి యంతము వచ్చియున్నది; వారిని భూమితోకూడ నాశనము చేయుదును" అని చెప్పెను - ఆది 6:18
ఈ వాక్కులు జలవళయమునాటి ప్రజల ఆత్మీయ దుస్థితిని వర్ణించుచున్నవి. అట్టి ఘోర పాప ప్రవంచములో నోవహు ఒక్కడే దేవుని దృష్టికి మంచివాడుగ కనబడెను (ఆది 7:1). పరిసరముల ప్రభావము మానవ వ్యక్తిత్వమును మార్చునని చెప్పుదురు. ఇది చాలవరకు సత్యము. కాని నోవహు తన వరిసరములను అతిక్రమించి ప్రవర్తించెను. తానున్న నైతిక వాతావరణమునకు భిన్నముగ బ్రతికెను. తన సమకాలికుల దుష్ట ప్రవర్తనకు వ్యతిరేకముగ జీవించెను. ఇతని గూర్చి బైబిలులో చెప్పబడిన మాటలతని వ్యక్తిత్వమును సూచించుచున్నవి.
నోవహు యెహోవా దృష్టికి కృవ పొందినవాడు (ఆది 6:3)
తెలుగులో “కటాక్షము” అను పదమునకు ఇంగ్లీషు తర్జుమలో “కృప” అను పదము వాడబడినది. బైబిలులో ఈ కృప అను పదము మిక్కిలి ప్రియమైన/శ్రేష్టమైన వదము. క్రొత్త నిబంధనకు ఇది పునాదియై యున్నది. మానవుల యెడల దేవుని నిర్హేతుక ప్రేమయే కృన. మనము దేవునినుండి పొందు దీవెనలన్నియు కృపవలెనె. మనము అర్హులము కాకపోయినను మనకు ఉచితముగా ఇవ్వబదినదే దేవుని యొక్క కృప. మనము కృవ వలన రక్షింపబడియున్నాము. అయితే “కృవ” అను ఈ చక్కని పదము బైబిలులో నోవహును గురించియే మొట్టమొదట వాడబడెను. ఆదాము నరులలో ప్రథముడు; కయీను సోదరులలో ప్రథముడు; హనోకు ప్రవక్తలలోను, దేవునితో నడిచిన వారిలోను మొదటివాడు; మెతూషెల ఆయుషులో మొదటివాడు; నోవహు దేవుని కృవ పొందినవారిలో జ్యేష్ఠుడు; గనుక అందరికన్న శ్రేష్ఠుడు. అతడు దేవుని దృష్టికి కృప పొందినవాడు అని చెప్పబడినది. దేవుని దృష్టి అందరిమీద నున్నది (కీర్త 14:2; 2 దిన 16:9). దేవుని దృష్టి జలప్రళయమునకు ముందుండిన ప్రజలమీద ఉండినప్పుడు ఆయన ఉగ్రత వారిమీదికి దిగెను. కాని, ఆ దేవుని ద్రుష్టి నోవహు మీద పడినప్పుడు దేవుని కృపావర్షమునతని మీదికి వచెను.
నోవహు నీతిపరుడు
“నీతి” యను పదమునకు ఇంగ్లీషులో “Just” అనగా ‘న్యాయము’ అను పదము వాడబడినది. ఈ పదమునందు అనేక సద్గుణములు ఇమిడియున్నవి. నోవహు యొక్క నీతియందు న్యాయముండెను. అన్యాయ వర్తనులైన ప్రజల మధ్య నోవహు న్యాయవర్తనుడై యుండెను. పవిత్ర జీవితము నోవహు నీతిలో మరియొక లక్షణము. “ఈ తరము వారిలో నీవే నాయెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని” అని దేవుడు నోవహుతో ననెను (ఆది 7:1). ఇచ్చట “నీతిమంతుడు” అను పదమునకు ఇంగ్లీషులో “Righteous” అను వదము వాడబడినది. దీని యర్థము ఖచ్చితమైన తిన్నని జీవితము. పరిశుద్ధతయే నీతియొక్క ఫలితము. బురదలోని స్వచ్ఛమైన లిలియా పుష్పమువలె పాప ప్రపంచములో నోవహు తన పవిత్ర జీవితమును వికసింపజేసెను. అతని 500 సంవత్సరముల బ్రహ్మచర్యము దీనికి తార్కాణము. నోవహు నీతిమంతుడు మాత్రమేగాక నీతిని ప్రకటించినవాడు. “నీతిని ప్రకటించిన నోవహు” అనిపేతురు వ్రాసెను (2 పేతురు. 2:5). ఆ ప్రకటనలో అప్పటి లోకముమీద నేర స్థాపన చేసెను. అనగా పాపమును ధైర్యముతో ఖండించెను (హెబ్రీ 11:7) అతడు తాను ప్రకటించిన నీతిని అనుసరించెను. ఇది బోధకులకు అవనరమైన లక్షణము. కావున నోవహు మాదిరి బోధకుడని చెప్పవచ్చును. ప్రకటించుట సులభము; కాని ప్రకటించిన దానిని ఆచరించుట కష్టము. సీతిమంతుల నహవాసము లేకయే నోవహు ఒంటరిగా తన నీతిని ప్రదర్శించుచు దానిని ప్రకటించెను. అతని నీతి విశ్వాసమునుబట్టి కలిగిన నీతి. నోవహు దానికి వారసుడాయెను (హైబ్రీ 11:7).

నోవహు నిందారహితుడు
నిందారోపణ దుష్టులకు ఒక అండ. నీతిమంతుల మీద అపనిందలు మోవుచు దాని వెనుక తమ అవినీతిని దాచుకొన యత్నించుట దుర్మార్గుల లక్షణము (యెహె 18:20; ఆమో 5: 10) నిందారహితులముగ నుండుట కష్టసాధ్యమైన వని. ఆనాటి ప్రజలు నోవహు మీద నింద మోపుటకు యత్నించిరనుట నిర్వివాదాంశము. కాని విఫల మనోరధులైరి. దానియేలు మీద నేరము మోపాలని యత్నించిన దుష్టులెట్ల విఫలులైరో అట్లే నోవహు యెడలను జరిగెను. క్రైస్తవులు నిందారహితులుగా నుండుట ఎంతో అవసరము. లేనియెడల మనము ప్రకటించు సువార్త ఫలహీనమగును. పౌలు ఫిలిప్పీయులకు వ్రాయుచు, వారు నిరపాయులుగను, నిందారహితులుగను నుండవలయునని హెచ్చరించెను (ఫిలిప్పీ 2:15). దేవుడు అబ్రాహాముతో “నా సన్నిధిలో నడుచుచు, నిందారహితుడవై యుండుము” అని చెప్పెను (ఆది 17:1). “నిందారహితుడు” అను మాటకు ఇంగ్లీషులో నిచ్చట “Perfect” “సంపూర్ణుడు” అను మాట వాడబడెను. నోవహు అన్ని విషయములలో సంపూర్ణుడై యుండెను (మత్త 5: 48). మన సంఘములు నిందారహితములా: క్రైస్తవులు నిందారహితులా ?
నోవహు దేవునితో నడచినవాడు
ఆది 3:9 ఈ వచనములో నోవహు దేవునితో నడిచెను అను వాక్యమును చూడగలము. నోవహు తన ముత్తాత వలెనె దేవునితో నడిచెను. జలప్రళయమునకు ముందున్న ప్రపంచములో దేవునితో నడిచిన ఇద్దరిలో హనోకు ప్రథముడు. నోవహు ద్వితీయుడు. దేవునితో నడచుట వలన హనోకు మరణమును దాటగా, నోవహు జలప్రళయమును దాటెను. హనోకు వరలోకమును జేరగా, నోవహు నూతన ప్రపంచమున ప్రవేశించి దానిని తన సంతతితో నింపెను.
నోవహు విజ్ఞాపన ప్రార్థనాపరుడు
బైబిలులో ఐదుగురు విజ్ఞావన ప్రార్థనావరులను గురించి ఉదహరింపబడెను. వారిలో ప్రథముడు నోవహు.
నోవహుయొక్క ఓడ
నోవహు ఓడ నిర్మాణమొక మహత్తరమైన యాశ్చర్య కార్యము, ఇతడు ప్రపంచము నందలి ఒక నిర్మాణికులలో ప్రథముడును, అతి శ్రేష్ఠుడునై యున్నాడు. అప్పటికాలపు జ్ఞానమునుబట్టియు, అందుబాటులోనున్న పరికరములను బట్టియు అతడు సాధించిన కార్యము అతీతమైనది. అసాధ్యమైనదని కూడ చెప్పవలయును. అతడు నిర్మించిన ఓడ బ్రహ్మాండమైనది; మూడంతస్థులు గలది: 525 అడుగుల పొడవును, 87 అడుగుల వెడల్పును, 62 అడుగుల ఎత్తును గలది. (1 సర = 21 అంగుళములు). దీని ప్లాను వేసిన నిర్మాత దేవుడు. ఆ ప్లానును అమలులో పెట్టిన ఇంజనీరు నోవహు. ఈ ఓడ 6 నెలలు రేవు చేరకుండా అగాధ జలములవై విహరించెను. దీనికి చుక్కాని (Steering) ఉన్నట్లు కన్పింపదు. దీనికి ఒక్కటే ద్వారము. దానిని దేవుడు బైట బిగించి, లోన నోవహు కుటుంబమును మూసివేసెను. దీనిని కట్టుటకు నూరేండ్లకంటె ఎక్కువ కాలము వట్టెను. నోవహు ఈ ఓడను సముద్రమునకు దాదాపు 100 మైళ్ళ దూరమున మెసపోతేమియ మైదానములో కట్టెను. ఓడ నిర్మాణమెప్పుడును సముద్ర సామీప్యమున జరుగును. కావున నోవహు కార్యము ఆ కాల ప్రజలకు హాస్యాస్పదముగ నుండెను. భక్తిహీనుల హేళనలను నూరు సంవత్సరములు సహించుటకెంతో ధైర్యము, ఓపిక, పట్టుదల, విశ్వాసములు కావలయును. అందులకే నోవహు పేరు విశ్వాసుల జాబితాలోనికి వచ్చెను (హెబ్రీ 11:7). ఈ గుణములన్నియు నోవహు కుండెను. కావున ఇతడు బైబిలు పురుషులతో సమాన వీరుడు. నోవహు ఓడ ప్రభువైన క్రీస్తుకు ముంగుర్తుగా నున్నది. ఆది లోపటను వెలుపటను కీలుతో పూయబడెను. “కీలు” అను మాటకు లేవికాండము 17:11 లోని “ప్రాయశ్చిత్తము” అను మాటకును గ్రీకు భాషలో ఒకే పదము వాడబడెను. ఆ ఓడ 40 దినములు ప్రచండ వర్షములో నుండుట బాప్తిస్మమునకు సాదృశ్యముగ నున్నది. (1 పేతురు 3:20, 21). “క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని యెరుగరా? కాబట్టి మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి” అని పౌలు చెప్పుచున్నాడు. (రోమా 6:3, 4). ఓడలో నుండిన నోవహు కుటుంబము క్రీస్తు సంఘమునకు సాదృశ్యముగ నున్నది. ఆ సంఘము క్రీస్తను ఓడయందుండి ఆయన మరణ పునరుత్థానములలో పాల్గొనుచున్నది. నోవహు ఓడ 5 నెలలైన పిమ్మట ఆరారాతు కొండలమీద నిలిచెను. ఇది యొక విచిత్ర సంభవము. అట్టిదెన్నడును జరిగియుండలేదు. ఇక నెన్నడును జరుగబోదు. సముద్రములో మునిగియున్న కొండ లెన్నో యున్నవి. కాని వాని శిఖరములను తాకిన వెంటనే ఎంతటి ఉక్కు ఓడయైనను నడిమికి బ్రద్దలగును. కానీ ఈ ఓడ పర్వత శిఖరమున నిలుచుట యొక మహాద్భుతము. దేవుడే దానిని వదిలముగ నెత్తి ఆ శిఖరము మీద నుంచెను. ఆ శిఖరము 16,920 అడుగుల ఎత్తుగలది. దీనికి పైగా 26 అడుగులకు మించి ప్రళయజలములు ప్రవహించెను. ఈ కొండ రూపాంతరపు కొండకు గురుతుగ నున్నది. ఓడలోనికి వచ్చిన పవిత్ర జంతువులు ఏడు జతలును, అవవిత్ర జంతువులు ఒక జత చొప్పున నుండెను. ఓడనుండి బయటకు వచ్చిన తర్వాత నోవహు పవిత్ర జంతువులలో కొన్నింటిని దేవునికి దహన బలగా నర్పించెను. ఇది నూతన ప్రపంచములో నోవహు చేసిన మొదటి కార్యము. ఇది హెబెలు తర్వాత అర్పింపబడిన రెండవ బలి. దేవుడు దాని సంగీకరించి అతనితో నొక నిబంధనను చేసెను. ఇది మూడవ నిబంధన, నోవహుకు ముగ్గురు బిడ్డలుండిరి. వారిలో యాపెతు మొదటివాడు; షేము నడిమివాడు; హాము కనిష్ఠుడు. ఇప్పటి ప్రపంచమందలి మానవ జాతి వీరి సంతానమే. యూదులు షేము సంతతివారు. ఈ సంతతి నుండి అబ్రాహాము, యూదా, దావీదుల ద్వారా రక్షకుడైన క్రీస్తు వచ్చెను. నోవహు, భౌతికరీతిగా నూతన ప్రపంచమందలి మానవ జాతికి మూలపురుషుడు.
నోవహు యొక్క పాపము
ఇంత ఘనుడైన నోవహు చరిత్ర విషాదకరముగ ముగియుచున్నది. నోవహు మొదట వ్యవసాయకుడు. మొట్టమొదటి ద్రాక్ష తోటను నాటినవాడు. ద్రాక్షరస పానీయమును కనిపెట్టినవాడు కూడ ఇతడే. ఇదియే మద్యపానమునకు ప్రారంభము. మద్యపానముచే నోవహు మత్తుడై దిగంబరిగ నుండ హాము చూచి నవ్వి తండ్రి కోపమునకు, శాపమునకు గురియయ్యెను. ఈ శాపము హాము సంతతి నింకను అంటియున్నది. బిడ్డలకు దీవెన నియ్యవలసిన తండ్రి కుమారునికి శాపము నిచ్చెను. ఇది సురాపాన ఫలితము. నోవహంతటివాడు ప్రపంచమును పీడించుచున్న సురాపాన పిశాచికి మూలపురుషుడగుట శోచనీయము. ఎంతటివానినైనను లొంగదీయుటకు పాపము మన వాకిటనే పొంచియున్నది. నోవహు జీవితమందలి ఈ ఆఖరు ఘట్టము మనకు జాగ్రత్త సూచనగా బైబిలునందు భద్రము చేయబడినది. తాను నిలుచుచున్నానని తలంచువాడు పడకుండ చూచుకొనవలయునని పౌలు హెచ్చరించుచున్నాడు (1 కొరి 10:12). ఈ ఒక్క బలహీనతలో తప్ప తక్కిన విషయములన్నిటిలో నోవహు ఆదర్శ పురుషుడు. అతని యాదర్శ జీవితమును స్మరించుకొని ధన్యుల మగుదుముగాక !